Begin typing your search above and press return to search.

శవంతో సెక్స్? ఐదు లక్షలతో ఎర

By:  Tupaki Desk   |   21 Nov 2017 10:49 AM IST
శవంతో సెక్స్? ఐదు లక్షలతో ఎర
X
సినిమా ప్రచారం కోసం.. రకరకాల దారులు ఉంటాయి. కొందరు కొత్తవి సృష్టిస్తూ ఉంటారు. మరికొందరు ఫాలో అవుతూ ఉంటారు. సినిమాను అనుసరించి ఈ పబ్లిసిటీ స్టంట్స్ ఉంటాయి. మా సినిమా భయపడుకుండా చూస్తే అంతిస్తాం.. ఇంతిస్తాం.. లాంటి ప్రకటనలే కాదు.. అదే థీమ్ తో సినిమా కూడా వచ్చేసింది. ఇప్పుడు ధన్ రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా దేవి శ్రీ ప్రసాద్ కు కూడా కొత్త యాంగిల్ లో ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ శుక్రవారం నాడు దేవి శ్రీ ప్రసాద్ థియేటర్లలోకి వస్తోంది. శవంతో కుర్రాళ్లు ప్రవర్తించే తీరును చూపించిన ట్రైలర్ పై ఇప్పటికే విమర్శలు వచ్చాయి. ఏకంగా శవంతో సెక్స్ చేసినట్లు చూపిస్తే మరి ఉండవా? వివాదంతో అయినా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్ కోసం ఇప్పుడు నిర్మాతలు కొత్త టెక్నిక్ అవలంబిస్తున్నారు. 'ఇప్పటివరకూ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఎవరూ.. ఎప్పుడూ టచ్ చేయని ఓ కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాం. ఇలాంటి పాయింట్ తో గతంలో ఓ మూవీ వచ్చిందని ప్రూవ్ చేస్తే.. 5 లక్షల రూపాయలు గిఫ్ట్ గా అందిస్తాం' అంటూ ఎర వేస్తున్నారు నిర్మాతలు.

కొత్తదనం కోరుకునే ప్రతీ ఒక్కరికీ తమ సినిమా నచ్చుతుందని అంటున్న దేవి శ్రీ ప్రసాద్ మేకర్స్.. ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే మూవీ అని అంటున్నారు. అలాగే.. అతి తక్కువ సమయంలోనే మూవీని పూర్తి చేయగలిగామని.. కేవలం 20 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అయిందని.. ఇందుకు నటీనటులు.. టెక్నికల్ స్టాఫ్ ఎంతో కృషి చేశారని అంటున్నారు.