Begin typing your search above and press return to search.

ఆది కవి కోసం రాక్ స్టార్ మ్యూజిక్

By:  Tupaki Desk   |   27 Jan 2018 5:00 AM IST
ఆది కవి కోసం రాక్ స్టార్ మ్యూజిక్
X
రాక్ స్టార్ గా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. తన తండ్రి సత్యమూర్తిని ఎంతగా కీర్తిస్తాడో చెప్పాల్సిన పని లేదు. తండ్రి కాలం చేసిన తర్వాత.. ఆయన స్మారకంగా పలు కార్యక్రమాలు చేస్తున్న దేవిశ్రీ.. రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో.. సత్యమూర్తి పేరిట ఓ యోగ సెంటర్ నిర్మాణం కాగా.. దేవిశ్రీ ప్రసాద్ తల్లి శిరోమణి సత్యవాణి చేతుల మీదుగా ఈ యోగ సెంటర్ ప్రారంభమైంది.

ఆ సమయంలో యూనివర్సిటీ కోసం ఓ ప్రత్యేక గీతం ఉంటుందనే ఆలోచన కలిగింది. విద్యార్ధులు కూడా ఇదే కోరడంతో.. తనే ఓ బాణీని కూర్చి ఓ గీతాన్ని స్వరపరిచాడు దేవిశ్రీ. వెనెగళ్ల రాంబాబు రాసిన ఈ పాటకు.. దేవిశ్రీ సంగీతం అందించగా.. ఆదికవి నన్నయ గురించి.. అలాగే ఈ యూనివర్సిటీ చరిత్ర.. ఘనతలను కీర్తించేదిగా ఈ గీతం సాగుతుంది. పలు ప్రయోజనాలను ఇప్పటికే ఈ యూనివర్సిటీ నుంచి అగ్రగణ్యులుగా ఎదిగిన వారిని గుర్తు చేస్తూ సాగే ఈ గీతాన్ని.. ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటడం విశేషం.

తను ప్రత్యేకంగా స్వరపరచి అందించిన ఈ యూనివర్సిటీ గీతాన్ని.. వైస్ ఛాన్సలర్ కు అందించాడు దేవిశ్రీ. అలాగే తన తండ్రి సత్యమూర్తి పేరిట ఇక్కడ యోగా సెంటర్ ను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు దేవిశ్రీ ప్రసాద్.