Begin typing your search above and press return to search.

సుక్కు.. స్నేహితుల్ని వదిలేశాడు

By:  Tupaki Desk   |   8 Jun 2016 4:00 AM GMT
సుక్కు.. స్నేహితుల్ని వదిలేశాడు
X
డైరెక్ట‌ర్ సుకుమార్ కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్‌.. సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు ఎంత మంచి స్నేహితులు కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. సుక్కు ప్ర‌తి సినిమాకూ దేవినే మ్యూజిక్ డైరెక్ట‌ర్. అత‌డి డైరెక్ష‌న్లో వ‌చ్చిన మెజారిటీ సినిమాల‌కు ర‌త్న‌వేలే సినిమాటోగ్రాఫ‌ర్‌. గత ఏడాది ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో సుక్కు నిర్మాత‌గా మారాల‌ని నిర్ణ‌యించుకుంటే ఆ ఇద్ద‌రు మిత్రులు ఉచితంగా ప‌ని చేయ‌డానికి ముందుకొచ్చారు. ఆ త‌ర్వాత లాభాల్లో వాటా ఇచ్చిన‌ప్ప‌టికీ ముందు ఇలా డ‌బ్బులు తీసుకోకుండా ప‌ని చేయ‌డం గొప్ప విష‌య‌మే. ఐతే త‌న నిర్మాణంలో రాబోయే త‌ర్వాతి సినిమాకు మాత్రం సుక్కు వీళ్లిద్ద‌రినీ ప‌క్క‌న‌బెట్టేస్తున్నాడు.

సుక్కు నిర్మాణంలో శ‌ర్వానంద్ హీరోగా తెర‌కెక్క‌బోయే సినిమాకు దేవి.. ర‌త్న‌వేలు ప‌ని చేయ‌ట్లేదు. ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా సాయికార్తీక్.. సినిమాటోగ్రాఫ‌ర్ గా ప్ర‌వీణ్ ఎంపిక‌య్యారు. ప్రతిసారీ దేవి.. ర‌త్న‌వేలుల‌ను బేర్ చేయ‌డం క‌ష్ట‌మ‌ని.. లాభాల్లో వాటా ప‌ద్ధ‌తి అన్నిసార్లూ వ‌ర్క‌వుట్ కాద‌ని సుక్కు ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌. సినిమా బ‌డ్జెట్ కు త‌గ్గ‌ట్లుగా టెక్నీషియ‌న్స్ ను ఎంచుకున్నాడు సుక్కు. ఈ చిత్రానికి చంద్ర‌మోహ‌న్ అనే కొత్త డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు. ఐతే త‌న ద‌ర్శ‌క‌త్వంలో రాబోయే సినిమాకు మాత్రం మ‌ళ్లీ దేవిశ్రీకే ఛాన్సిచ్చాడు. చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్క‌బోయే ఈ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ కు దేవి క‌న్ఫ‌మ్ అయ్యాడు. ర‌త్న‌వేలు సంగ‌తి తేలాల్సి ఉంది.