Begin typing your search above and press return to search.

మాల‌యాళ‌ శృంగార తారపై `బిగ్ బాస్` ఫేం రీసెర్చ్!

By:  Tupaki Desk   |   3 Oct 2020 5:30 PM GMT
మాల‌యాళ‌ శృంగార తారపై `బిగ్ బాస్` ఫేం రీసెర్చ్!
X
మాలీవుడ్ శృంగార తార ష‌కీలా జీవితంపై సినిమాలొచ్చాయి. త‌నే స్వ‌యంగా బ‌యోపిక్ తీస్తున్నాన‌ని ష‌కీలా ప్ర‌క‌టించారు. అయితే అవ‌న్నీ ఒకెత్తు అనుకుంటే త‌న‌లోని `గొప్ప మ‌న‌సున్న‌ మ‌నిషి` అనే కోణంపై బిగ్ బాస్ ఫేం జ‌ర్న‌లిస్ట్ దేవీ నాగవల్లి చెప్పిన సంగ‌తులు ఆస‌క్తిని రేకెత్తించాయి.

అస‌లు ష‌కీలా అంటే ఏదో అనుకుంటాం. కానీ త‌న నిజం వేరే. ఆమెను ఇంట‌ర్వ్యూ చేసేందుకు ఫోన్ చేస్తే చ‌క్క‌గా రిసీవ్ చేసుకున్నారు. అస‌లు వేరే ఏ ఫోన్లు ఎత్త‌ర‌ని కూడా తెలిసింది. కానీ మేం కాల్ చేయ‌గానే ఇంట‌ర్వ్యూకి అంగీక‌రించారు. అప్పుడు చెన్న‌య్ కి త‌న రూమ్ కి వెళ్లాం. ఆ రూమ్ చూడ‌గానే షాక్ కి గుర‌య్యాను. అది చాలా చిన్న గ‌ది. కూలిపోవ‌డానికి సిద్ధంగా ఉన్న గోడ‌. కానీ త‌ను మ‌మ్మ‌ల్ని రిసీవ్ చేసుకున్న తీరు ఎంతో గొప్ప‌గా ఉంది. కాఫీ కూడా ఇచ్చారు! అంటూ దేవీ నాగ‌వ‌ల్లి ష‌కీలా గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలీని కొన్ని గ‌మ్మ‌త్త‌యిన విష‌యాలు తెలిపారు.

బిగ్ బాస్ ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చాక దేవి నాగ‌వ‌ల్లి మీడియా చిట్ చాట్ల‌తో బిజీ అయిపోయారు. ఓ యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ష‌కీలా గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. జ‌ర్న‌లిస్టుగా త‌న‌ని ఇంట‌ర్వ్యూ చేయ‌డం త‌న‌కి ద‌క్కిన అవ‌కాశంగా చెప్పుకొచ్చారు. ఒక నిర్మాత నుంచి త‌న ఫోన్ నంబ‌ర్ తీసుకున్నామ‌ని తెలిపారు. 30 మిలియ‌న్ల వ్యూస్ ద‌క్కించుకున్న ఆ ఇంట‌ర్వ్యూ ఇప్పుడు యూట్యూబ్ నుంచి డిలీట్ చేశార‌ని లేబుల్స్ వ‌ల్ల‌ కాపీ రైట్స్ స‌మ‌స్య వ‌ల్ల తీసేశార‌ని వెల్ల‌డించారు.