Begin typing your search above and press return to search.

ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ `ఫైట‌ర్`కి సూటవ్వ‌దేమో?

By:  Tupaki Desk   |   11 Jun 2020 5:15 AM GMT
ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ `ఫైట‌ర్`కి సూటవ్వ‌దేమో?
X
అత‌డేమో ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్‌. వీధి పోరాటాల‌తో `ఫైట‌ర్` గా నానా ర‌చ్చ‌ చేస్తాడు. అలాంటోడికి ఎంతో సెన్సిబుల్ గాళ్ ప‌రిచ‌యం. తాకితే చినిగిపోతుందేమో అనిపించేంత‌టి లేలేత అందంతో ఇంట‌రాక్ష‌న్. ఆ త‌ర్వాత రౌడీ ఫైట‌ర్ గారి ఫైటింగ్ పీక్స్ కి చేరుతుంది. మొత్తానికి ఒక యూనివ‌ర్శ‌ల్ ఎలిమెంట్ నే తీసుకుని పూరి ఫైట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.

విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి యూనివ‌ర్శ‌ల్ స్టార్ ని ఎంపిక చేసుకుని .. అటు బాలీవుడ్ కోసం అన‌న్య పాండే లాంటి యంగ్ బ్యూటీని బ‌రిలో దించి చాలానే ప్లాన్ చేశాడు. పూరి పాన్ ఇండియా ప్లాన్స్ కి త‌గ్గ‌ట్టే స్టార్లు కుదిరారు కానీ.. అంత ర‌ఫ్ అండ్ ఠ‌ఫ్ గా ఉండే కుర్రాడికి ఇంత లేలేత సౌంద‌ర్యం సూట‌వుతుందా? అన్న సందిగ్ధం కొంద‌రిలో లేక‌పోలేదు. ఇదివ‌ర‌కూ బైక్ పై రౌడీగారితో అన‌న్య రొమాన్స్ కి సంబంధించిన ఫోటోలు అంత‌ర్జాలాన్ని వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే. లేలేత అందాన్ని రౌడీ కాస్త ర‌ఫ్ గానే హ్యాండిల్ చేస్తున్నాడ‌ని అర్థ‌మైంది.

ఇక‌పోతే అన‌న్య పాండే సోష‌ల్ మీడియాలో నిరంత‌రం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. షారూక్ డాట‌ర్ సుహానా ఖాన్.. సైఫ్ డాట‌ర్ సారా అలీఖాన్ ల‌కు ధీటుగా త‌న‌కు ఫాలోవ‌ర్స్ ఉన్నారు. తాజాగా బ్లాక్ స్పోర్ట్ డ్రెస్ లో క‌నిపించిన అనన్య ఇంటి ప‌రిస‌రాల్లోని గార్డెన్ లో ఇదిగో ఇలా యోగా ప్రాక్టీస్ చేస్తూ క‌నిపిస్తోంది. ప్ర‌ఖ్యాత `బజా‌ర్ ఇండియా` మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం అన‌న్య ఇలా ఫోజిచ్చింది. యోగాలో శిల్పాశెట్టి.. క‌రీనా .. క‌త్రిన‌ల‌నే కొట్టేసేట్టుంది ఈ అమ్మ‌డు. ప్ర‌స్తుతం ఈ ఫోటో యూత్ లో వైర‌ల్ గా మారింది.