Begin typing your search above and press return to search.

ఆ మూడు మాధ్య‌మా‌ల్లో తెలుగు హీరోల రికార్డులు

By:  Tupaki Desk   |   18 July 2020 9:15 AM IST
ఆ మూడు మాధ్య‌మా‌ల్లో తెలుగు హీరోల రికార్డులు
X
సోష‌ల్ మీడియాల్లో ఎంత‌గా ఫాలోవ‌ర్స్ ని సంపాదిస్తే అంత క్రేజు. ఆ క్రేజుకు త‌గ్గ‌ట్టే ప్ర‌క‌ట‌న‌ల‌ ఆదాయం పెరుగుతుంది. ర‌క‌ర‌కాల మాధ్య‌మాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మ‌న స్టార్లు నిరంత‌రం ఫోటోలు.. వీడియోలు స‌హా ర‌క‌ర‌కాల విష‌యాల్ని షేర్ చేసి ఫాలోవ‌ర్స్ ని అసాధార‌ణంగా ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. అయితే ఈ త‌ర‌హాలో సౌతిండియా బెస్ట్ హీరోలు ఎవ‌రు? అన్న‌దే తాజా చ‌ర్చ‌. అలా ఎవ‌రు బెస్ట్‌? అన్న‌ది వెతికితే సౌత్ లో ఓ ముగ్గురు హీరోలు ఆ మూడు సామాజిక‌ మాధ్య‌మాల్లో టాప్ పొజిష‌న్ లో ఉన్నార‌ని తేలింది. ఆ ముగ్గురు హీరోలు తెలుగు హీరోలే కావ‌డం ఇక్క‌డ హైలైట్.

ఫేస్ బుక్ లో ఒక‌రు.. ట్విట్ట‌ర్ ‌లో ఒక‌రు.. ఇన్ స్టాలో వేరొక‌రు.. టాప్ స్టార్లుగా రికార్డులు అందుకున్నారు. ఇంత‌కీ ఏ మాధ్య‌మంలో ఏ హీరో నంబ‌ర్ వ‌న్ గా ఉన్నారు? అన్న‌ది ప‌రిశీలిస్తే.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ కోటి (10 మిలియ‌న్లు) మంది ఫాలోవ‌ర్స్ తో ట్విట్ట‌ర్ లో నంబ‌ర్ వ‌న్ గా ఉన్నాడు. ఆయ‌న‌కు స‌రిలేరు ఎవ్వ‌రూ.. స‌రి రాలేరు కూడా. ఆ ద‌రిదాపుల్లోనే వేరొక హీరో ఎవ‌రూ ట్విట్ట‌ర్ లో లేరు. అలాగే కోటి 60ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ తో ఫేస్ బుక్ లో సౌత్ నంబ‌ర్ వ‌న్ స్టార్ గా ప్ర‌భాస్ రికార్డుల‌కెక్కాడు. అటు సౌత్ ఇటు తెలుగు స్టార్ల‌లో ఎఫ్‌.బీలో అత‌డే నంబ‌ర్ వ‌న్.

టాలీవుడ్ సెన్సేషన‌ల్ హీరో విజయ్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ లో నంబ‌ర్ వ‌న్ స్థానం అందుకున్నారు. దాదాపు 80ల‌క్ష‌ల (8 మిలియ‌న్లు) మంది ఫాలోవ‌ర్స్ తో సౌత్ లో ఇప్ప‌ట్లో ఇంకెవ‌రూ ట‌చ్ చేయ‌లేని స్థానం అందుకున్నాడు. ఈ రికార్డ్ అందుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డుల‌కు ఎక్కాడు. అర్జున్ రెడ్డి- గీత గోవిందం సినిమాల‌తోనే అత‌డి స్థాయి అమాంతం పెరిగింది. ఫాలోవ‌ర్స్ కూడా అంతే ఇదిగా పెరిగారు. సామాజిక మాధ్య‌మాల్లో వెరైటీ ప్ర‌చారంతో దూకుడున్న హీరోగా విజ‌య్ కి పేరుంది.