Begin typing your search above and press return to search.

కమెడియన్ ట్వీట్ కి ముఖ్యమంత్రి కదిలాడు

By:  Tupaki Desk   |   9 Sep 2016 8:10 AM GMT
కమెడియన్ ట్వీట్ కి ముఖ్యమంత్రి కదిలాడు
X
సోషల్ మీడియా పవర్ ఎలా ఉంటుందో తెలిపే ఉదంతం ఇది. భారతీయ వ్యవస్థలో ఓ భాగం అయిపోయిన లంచాన్ని అరికట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామి.. కేంద్రంలో ఉన్న బీజేపీ చెబుతోంది. అచ్ఛేదిన్ వచ్చేస్తున్నాయి.. ఆ మాటకొస్తే వచ్చేశాయని కూడా చెప్పేయగలదు కమలం పార్టీ. కానీ టాప్ కమెడియన్ గా వెలికిపోతున్న కపిల్ శర్మకు ఓ విషయంలో మండుకొచ్చి.. ప్రధాని మోడీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ పెట్టాడు. ఆయన నుంచి రియాక్షన్ రాలేదు కానీ.. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. దీనికి ఆన్సర్ ఇవ్వడం విశేషం.

'గత ఐదేళ్లుగా నేను 15 కోట్ల రూపాయలు ఇన్ కం ట్యాక్స్ రూపంలో కడుతుంటే.. ఇప్పటికీ నా ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కి 5 లక్షల రూపాయలు లంచం చెల్లించాలి'.. 'మీరు చెప్పిన అచ్ఛేదిన్ ఇవేనా?' అంటూ నేరుగా మోడీనే నిలదీశాడు కపిల్ శర్మ. 'కపిల్ భాయ్.. దయచేసి పూర్తి వివరాలు ఇవ్వంండి. కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కు ఆదేశాలిచ్చాను. తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టం' అంటూ మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆన్సర్ ఇవ్వడం విశేషం.

ఇంతకీ ఏడాదికి 5 కోట్లు ట్యాక్స్ రూపంలో కడుతున్నాడంటే.. ఈ కమెడియన్ ఆదాయం ఎంతో అనిపిస్తోంది కదూ. అబ్బే పెద్దగా ఏం లేదండీ.. జస్ట్ ఒక్కో ఎపిసోడ్ కి 60 లక్షలు ఛార్జ్ చేస్తాడంతే.