Begin typing your search above and press return to search.

అప్పుడు అమ్మ.. ఇప్పుడు పెద్దమ్మ?

By:  Tupaki Desk   |   26 March 2016 6:45 AM GMT
అప్పుడు అమ్మ.. ఇప్పుడు పెద్దమ్మ?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ మూవీ సిద్ధమవుతోంది. రీసెంట్ గా ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. కోసం హైద్రాబాద్ సారధి స్టూడియోస్ లో వేసిన జనతా గ్యారేజ్ భారీ సెట్ లో కీలక సన్నివేశాలు పిక్చరైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో సహా ప్రధాన తారాగణంపై సీన్స్ షూటింగ్ జరుగుతోంది.

జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కు జోడీగా దేవయానిని నటింప చేయాలని ఇన్నాళ్లు యూనిట్ వర్గాలు భావించాయి. కానీ ఇప్పుడీ పాత్ర కోసం సుహాసినిని సంప్రదించారని తెలుస్తోంది. అమె కూడా ఈ రోల్ లో నటించేందుకు ఒప్పుకుందని, త్వరలో షూటింగ్ లో కూడా భాగం కానుందని అంటున్నారు. సీనియర్ నటి సుహాసిని గతంలో కూడా ఎన్టీఆర్ సినిమాల్లో కనిపించారు. కృష్ణ వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన రాఖీలో.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించగా.. ఆ తర్వతా శ్రీను వైట్ల మూవీ బాద్ షా లో ఎన్టీఆర్ తల్లిగా నటించారు సుహాసిని.

ఆ రెండు సినిమాలు సక్సెస్ సాధించడంతో.. సెంటిమెంట్ గానే సుహాసినిని జనతా గ్యారేజ్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో మోహన్‌ లాల్‌ ఎన్టీఆర్‌ కు పెదనాన్న కాగా.. సుహాసిని పెద్దమ్మ రోల్‌ లో మెరుస్తారనమాట. ఎన్టీఆర్ సరసన ఈ మూవీలో సమంత - నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.