Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌ లో దేవరకొండకు అరుదైన రికార్డ్‌

By:  Tupaki Desk   |   24 Oct 2019 10:03 AM GMT
బాలీవుడ్‌ లో దేవరకొండకు అరుదైన రికార్డ్‌
X
విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌ సెన్షేషన్‌ హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన చేస్తున్న సినిమాల కోసం ఫ్యాన్స్‌ ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి సబ్జెక్ట్‌ లను ఎంచుకుని మరీ చేస్తున్న విజయ్‌ దేవరకొండ అరుదైన రికార్డును దక్కించుకున్నాడు. విజయ్‌ దేవరకొండ నటించిన తెలుగు సినిమాలు హిందీలో రీమేక్‌ అవుతున్న విషయంలో ఈ రికార్డు దక్కింది.

అర్జున్‌ రెడ్డి చిత్రం బాలీవుడ్‌ లో కబీర్‌ సింగ్‌ గా రీమేక్‌ అయ్యింది. కబీర్‌ సింగ్‌ హిందీలో ఏ స్థాయిలో సూపర్‌ హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న కబీర్‌ సింగ్‌ ఇన్సిపిరేషన్‌ గా పలు విజయ్‌ దేవరకొండ సినిమాలు హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్తున్నాయి. కబీర్‌ సింగ్‌ సమయంలోనే డియర్‌ కామ్రేడ్‌ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయబోతున్నట్లుగా కరణ్‌ జోహార్‌ ప్రకటించాడు.

డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ఆశించిన స్థాయిలో కమర్షియల్‌ సక్సెస్‌ ను అందుకోలేదు. అయినా కూడా హిందీలో డియర్‌ కామ్రేడ్‌ చిత్రం రీమేక్‌ ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. త్వరలోనే ఆ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో విజయ్‌ దేవరకొండ ట్యాక్సీవాలా సినిమా రీమేక్‌ అధికారిక ప్రకటన వచ్చింది. ఇషాన్‌ ఖట్టర్‌ హీరోగా అనన్య పాండే హీరోయిన్‌ గా ట్యాక్సీవాలా రీమేక్‌ అవుతుంది. ఈ రీమేక్‌ కు 'ఖాలి పీలి' అనే టైటిల్‌ ను ఖరారు చేశారు.

ట్యాక్సీవాలా సినిమా విడుదలకు ముందే చాలా లీక్‌ అయ్యింది. అయినా కూడా సినిమాకు మంచి కమర్షియల్‌ టాక్‌ రావడంతో మంచి కలెక్షన్స్‌ నమోదు అయ్యాయి. ఆ కారణంగానే బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ అబ్బాస్‌ జాఫర్‌ ఈ రీమేక్‌ ను నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. ఇటీవలే ఖాలి పీలి సినిమా ఫస్ట్‌ లుక్‌ కూడా రివీల్‌ చేశారు. ఈ రీమేక్‌ లతో పాటు 'గీత గోవిందం' చిత్రం ను కూడా రీమేక్‌ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ట్యాక్సీవాలా.. డియర్‌ కామ్రేడ్‌.. గీత గోవిందం ఇలా విజయ్‌ దేవరకొండకు చెందిన పలు సినిమాలు హిందీలో రీమేక్‌ అవ్వబోతున్న నేపథ్యంలో రౌడీ స్టార్‌ ఖాతాలో అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్‌ లో రీమేక్‌ అయిన సినిమాల హీరోగా రికార్డు పొందబోతున్నాడు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ నటిస్తున్న వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంపై కూడా బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఒక కన్నేసి ఉంచారని కూడా సమాచారం అందుతోంది.