Begin typing your search above and press return to search.
#రౌడీ ఛాయాచిత్రం.. భారతంలో అర్జునుడే అయితే..!
By: Tupaki Desk | 8 Sept 2021 5:00 AM ISTనేటి జనరేషన్ లో వైబ్రేంట్ పర్సనాలిటీ తో శరవేగంగా దూసుకెళుతున్న స్టార్ గా విజయ్ దేవరకొండ పేరు మార్మోగుతోంది. నేచురల్ స్టార్ నాని తర్వాత మళ్లీ అంతటి మాటకారితనం ప్రతిభ ఉన్నవాడిగా విజయ్ దేవరకొండ పాపులరయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తరహాలో ఫ్యాషన్స్ పరంగా ఒక యూనిక్ ట్రెండ్ ని క్రియేట్ చేస్తూ దూసుకెళుతున్నాడు విజయ్.
అర్జున్ రెడ్డి సూపర్ సక్సెస్ తర్వాత దేవరకొండ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. పాన్ ఇండియా చిత్రం లైగర్ తో అతడి పాపులారిటీ పదింతలవుతోంది. ఈ సినిమాని బాలీవుడ్ లో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు కరణ్ జోహార్ సన్నాహకాల్లో ఉన్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న లైగర్ తో పాన్ ఇండియా స్టార్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడు.
అయితే విజయ్ రొటీన్ మసాలా సినిమాల్లో కాకుండా పురాణాల్లో నటిస్తే ఎలా ఉంటుంది? అన్నది ఇంతవరకూ ఏ దర్శకుడు ఊహించనేలేదు. కానీ తన అభిమాని తనని అలా ఊహించింది. అతడు మహాభారతంలో అర్జునుడు అయితే ఇలా ఉంటాడు! అంటూ ఒక ఛాయాచిత్రాన్ని గీసింది శ్రుతి అనే అభిమాని. విల్లంబులు ధరించిన అర్జునుడిగా దేవరకొండ గెటప్ ఆకట్టుకుంటోంది. ఆసక్తికరంగా విజయ్ నవ్వు ముఖాన్ని ఈ డ్రాయింగ్ లో చూపించిన తీరు ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. విజయ్ ఈ పాత్రకు సరిపోతాడు! అన్నంత చక్కగా డ్రాయింగ్ ని గీసారు ఆ అభిమాని.
దురదృష్ఠవశాత్తూ బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ మహాభారతం ఇప్పట్లో తెరకెక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఇంతకుముందు మహాభారతం తెరకెక్కిస్తానని ఆసక్తిని కనబరిచిన అమీర్ ఖాన్ వెనకంజ వేసారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. కానీ ఆయనకు ఇప్పట్లో తీరిక చిక్కేట్టు కనిపించడం లేదు. ఒకవేళ పాన్ ఇండియా స్టార్ గా విజయ్ నిరూపించుకుంటే తదుపరి పురాణేతిహాసాల ఆధారంగా తెరకెక్కించే ఏ ఇతర సినిమాలో అయినా విజయ్ కి ఛాన్సుంటుందేమో! కనీసం అల్లు `రామాయణం`లో అయినా విజయ్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ రోల్ ఉంటుందేమో చూడాలి. విజయ్ లైగర్ చిత్రీకరణ పూర్తి చేసిన తర్వాత శివనిర్వాణతో.. సుకుమార్ తో సినిమాలు చేయాల్సి ఉంది.