Begin typing your search above and press return to search.

దర్శకుడు చెప్పిన దొంగల ముఠా వాళ్లేనా?

By:  Tupaki Desk   |   27 April 2020 2:40 PM IST
దర్శకుడు చెప్పిన దొంగల ముఠా వాళ్లేనా?
X
వెన్నెల.. ప్రస్థానం చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ విభిన్నమైన శైలిని ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు దేవ కట్టా. ఈయన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన ఆటోనగర్‌ సూర్య చిత్రం ఫ్లాప్‌ అయ్యింది. దాదాపు మూడు సంవత్సరాల పాటు ఆ సినిమా మేకింగ్‌ జరిగింది. ఒకానొక దశలో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం అనుమానమే అనుకున్నారు. ఆ సినిమా నిర్మాణ సంస్థ ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ ఆర్థికంగా నష్టపోవడంతో ఆటో నగర్‌ సూర్య చిత్రం అస్థవ్యస్థంగా మారింది.

సినిమాను అనుకున్నది అనుకున్నట్లుగా తీయలేక పోయాను అని ఆ సినిమా మేకింగ్‌ నా చేతిల్లో లేకుండా పోయిందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో దేవ కట్టా. ఆ సినిమా సమయంలో తానో దొంగల ముఠా చేతిలో చిక్కుకున్నట్లుగా చెప్పాడు. ఆ సినిమాతో తన కెరీర్‌ పూర్తిగా రివర్స్‌ అయ్యిందన్నాడు. ఆ దొంగల ముఠా ఎవరు అనేది ఆయన చెప్పలేదు. కాని నిర్మాతల వల్లే ఆయన నష్టపోయాడంటూ సినిమా ఫలితం తేడా కొట్టడానికి కారణం నిర్మాతలంటూ ఆయన పలు సార్లు సన్నిహితుల వద్ద అన్నాడట.

కెరీర్‌ పీక్స్‌ లో ఉన్న సమయంలో మూడు సంవత్సరాలు ఒకే సినిమా కోసం వర్క్‌ చేయడం అది కూడా ఫ్లాప్‌ అవ్వడంతో మళ్లీ ఇప్పటి వరకు దేవ కట్టా కోలుకోలేక పోయాడు. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా నిరాశ పర్చాయి. ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ తో ఒక సినిమాను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు. ఆ సినిమాను లాక్‌ డౌన్‌ ఎత్తివేయగానే మొదలు పెట్టబోతున్నాడు. మంచి ట్యాలెంటెడ్‌ దర్శకుడిగా పేరున్న దేవ కట్టా అదృష్టం కలిసి రాకపోవడంతో పాటు నిర్మాతల వల్ల ప్రభావితం అయ్యి చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. మరి తేజ్‌ తో చేస్తున్న సినిమా అయినా ఆయనకు మళ్లీ సక్సెస్‌ ను తెచ్చి పెడుతుందో చూడాలి.