Begin typing your search above and press return to search.

ప్రస్థానం.. వెబ్ సిరీస్ గా మారుతోంది

By:  Tupaki Desk   |   11 April 2017 9:57 AM GMT
ప్రస్థానం.. వెబ్ సిరీస్ గా మారుతోంది
X
‘వెన్నెల’ లాంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీ తీసిన దేవా కట్టా నుంచి ‘ప్రస్థానం’ లాంటి సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అప్పట్లో ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిసింది. సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్ల సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు కానీ.. గొప్ప సినిమాగా అయితే పేరు తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రం ఓ వెబ్ సిరీస్ కు స్ఫూర్తిగా నిలవడం విశేషం.

‘ఇంద్రప్రస్థం-సిటీ ఆఫ్ గాడ్’ పేరుతో ‘ప్రస్థానం’ను స్ఫూర్తిగా తీసుకుని ఓ వెబ్ సిరీస్ రూపొందుతుండటం విశేషం. ఐక్యాండీ క్రియేషన్స్ దీన్ని నిర్మించనుండగా.. యప్ టీవీ ప్రసారం చేయనుంది. మొత్తం కథను మూడు సీజన్లుగా తీర్చిదిద్దుతారట. ఒక్కో సీజన్లో 20 ఎపిసోడ్లు ఉంటాయి. ఫణీంద్ర ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తాడు. ఇందులోని పాత్రలు ప్రస్థానం చిత్రంలోని ప్రధాన పాత్రల్లాగే ఉంటాయట. తన సినిమా వెబ్ సిరీస్ కు స్ఫూర్తిగా నిలవడంపై హర్షం ప్రకటించాడు దేవా కట్టా. అతనే ‘ఇంద్రప్రస్థం-సిటీ ఆఫ్ గాడ్’ గురించి ట్విట్టర్లో వివరాలు వెల్లడించాడు.

‘ప్రస్థానం’ తర్వాత పెద్ద దర్శకుడిగా ఎదుగుతాడనుకున్న దేవా కట్టా.. అంచనాల్ని అందుకోలేకపోయాడు. అతడి తర్వాతి సినిమా ‘ఆటోనగర్ సూర్య’ తీవ్రంగా నిరాశ పరిచింది. ఆపై ‘డైనమైట్’ అతడి ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసింది. ప్రస్తుతం దేవా.. హిందీలో ‘ప్రస్థానం’ను రీమేక్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. తెలుగులోనూ ఓ సినిమా చేయడానికి అతను సన్నాహాలు చేసుకుంటున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/