Begin typing your search above and press return to search.

ఫైనల్ గా సుప్రీమ్ హీరోతో సెట్ అయ్యిందా?

By:  Tupaki Desk   |   23 Jun 2019 12:50 PM IST
ఫైనల్ గా సుప్రీమ్ హీరోతో సెట్ అయ్యిందా?
X
శర్వానంద్ కెరీర్ ప్రారంభంలో అతనితో పాటు సందీప్ కిషన్ సాయి కుమార్ లకు పెద్ద బ్రేక్ గా నిలిచిన ప్రస్థానం దర్శకుడు దేవ కట్ట ఆ ఒక్క సినిమాతోనే చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. పొలిటికల్ డ్రామాను తెరకెక్కించిన తీరుకి ప్రశంశలు ఘనంగా దక్కాయి. తరువాత భారీ బడ్జెట్ తో ఆటో నగర్ సూర్య చేస్తే దాని ఫలితం అనుకూలంగా రాక కెరీర్ మీద చాలా ప్రభావం చూపించింది.ఆ మధ్య మంచు విష్ణుతో డైనమైట్ అంటే రీమేక్ చేస్తే అదీ వర్క్ అవుట్ కాలేదు .

తర్వాత బాహుబలి వెబ్ సిరీస్ తో బిజీగా మారిపోయిన దేవా కట్ట ప్రస్తుతం సంజయ్ దత్ తో ప్రస్థానం రీమేక్ పనుల్లో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉంది. ఇంకో మూడు నాలుగు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత దేవ కట్ట ఎవరితో చేస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. విశ్వసనీయ సమాచారం మేరకు దేవకట్ట సుప్రీమ్ హీరో సాయి తేజ్ ను తన లైన్ తో మెప్పించినట్టుగా టాక్ ఉంది. ప్రస్తుతం మారుతీకి కమిట్ అయిన ఈ హీరో అది పూర్తయ్యాక దేవ కట్టకు డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

నిర్మాత ఎవరు అనే క్లారిటీ ఇంకా రావలసి ఉంది. అయితే ఇదంతా లీకైన న్యూసే కాని అధికారిక ప్రకటన వచ్చే వరకు ఖరారుగా చెప్పలేం. ఆరు డిజాస్టర్ల తర్వాత చిత్రలహరి రూపంలో కొంత రిలాక్స్ అయిన సాయి తేజ్ ఇకపై కథలు దర్శకుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. ఫాంలో లేని దేవకట్టకు ఎస్ చెప్పాడనేది నిజమే అయితే అంత మెప్పించిన స్టొరీ లైన్ ఏమిటో మరి