Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: సంక్రాంతికి వ‌స్తాము రామా హ‌రే!

By:  Tupaki Desk   |   27 July 2020 10:45 AM IST
ట్రెండీ టాక్‌: సంక్రాంతికి వ‌స్తాము రామా హ‌రే!
X
పండ‌గ‌లు అంటే సినిమావాళ్ల‌కు సెంటిమెంటు. కానీ ఏం లాభం? స‌మ్మ‌ర్ ఉగాది గాయ‌బ్! రిలీజ్ లేవీ లేవ్!! 22 ఆగ‌స్టు‌ వినాయ‌క చ‌వితి... మంచి ముహూర్త‌మే కానీ సినిమాలు రిలీజ‌వుతాయా అంటే సీన్ అలా లేదు. ఆ త‌ర్వాత అక్టోబ‌ర్ వ‌ర‌కూ ఆగాలి. అప్పుడు ద‌స‌రా వ‌స్తుంది. అప్ప‌టికి అయినా మ‌హ‌మ్మారీ శాంతించి వ్యాక్సినో టీకానో వ‌స్తుందా? అంటే ప్చ్.. అలాంటిదేమీ క‌నిపించ‌డం లేదు. అటుపై దీపావ‌ళి వస్తుంది. ఇది త‌మిళ తంబీల‌కు పెద్ద పండ‌గ‌. కానీ చెన్న‌య్ స‌హా త‌మిళ‌నాడులో మ‌హా విల‌యం కొన‌సాగుతోంది. ఇదిలా ఉంటే క్రిస్మ‌స్ వ‌ర‌కూ వేచి చూస్తారు. అంటే డిసెంబ‌ర్ వ‌చ్చేస్తుంది. అప్ప‌టికీ ఈ విల‌యం ఇలానే కొన‌సాగితే రిలీజ్ ల ప‌రిస్థితేమిటి?

అప్ప‌టికి పెండింగ్ షూట్లు పూర్తి చేసి నిర్మాణానంత‌ర ప‌నులు చేసేస్తే ఇక సంక్రాంతిపై క‌న్నేస్తారు. ప‌రిస్థితి స‌ద్ధుమ‌ణిగితే ఇదే పెద్ద పండ‌గ‌. ఇంత‌కీ 2021 సంక్రాంతి స‌జావుగా సాగుతుందా? ల‌క్కీగా 2020 సంక్రాంతి ఓ రెండు భారీ చిత్రాల‌కు క‌లిసొచ్చింది. అల వైకుంఠ‌పుర‌ములో- స‌రిలేరు నీకెవ్వ‌రు బాక్సాఫీస్ ని కుమ్ముకున్నాయి. ఆ త‌ర్వాత భీష్మ కు త‌ప్ప ఇంకే సినిమాకి ఛాన్సు లేకుండా పోయింది. ఈలోగా మ‌హ‌మ్మారీ అంటుకుని పీడ‌క‌ల‌ల్ని తెచ్చింది.

అయినా ఈ ఏడాది ఇలా ముగిసినా క‌నీసం 2021 సంక్రాంతి నాటికి అయినా బాగ‌వుతుందా? అంద‌రిలోనూ ఏదో ఆశ‌. అస‌లు షూటింగులే జ‌ర‌గ‌డం లేదు. రిలీజ్ ల గోలేమిటి? అంటారా? కానీ మ‌నిషి ఆశాజీవి కాబ‌ట్టి ఇక అప్ప‌టికి అయినా మ‌హ‌మ్మారీకి లాక్ వేసి ఏదోలా షూటింగులు చేసి రిలీజ్ ప్లాన్ చేస్తార‌నే ఆశిద్దాం. అప్ప‌టికి రిలీజ్ ల‌కు వ‌చ్చేది ఎవ‌రు? అన్న‌ది విశ్లేషిస్తే...

ఓ నాలుగైదు చిన్నా పెద్దా సినిమాలు క‌నిపిస్తున్నాయి. వాటిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ - వకీల్ సాబ్ ... నితిన్ - రంగ్ దే.. ర‌జ‌నీ కాంత్ - మాస్టార్ (అనువాదం) 2020 సంక్రాంతికి రిలీజ‌య్యేందుకు ఆస్కారం ఉందిట‌. ర‌జ‌నీ చిత్రం దీపావ‌ళి మిస్ కానీ సంక్రాంతి 2021 ఖాయం అని అంచ‌నా వేస్తున్నారు. ఆగ‌స్టు లేదా ద‌స‌రా బ‌రిలో వీ కానీ.. ఉప్పెన కానీ రాక‌పోతే క‌చ్ఛితంగా సంక్రాంతికే రావాల్సి ఉంటుంది. ఇక బాల‌కృష్ణ‌- వెంక‌టేష్- నాగార్జున - మ‌హేష్ - చిరంజీవి వీళ్లంతా 2021 ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్ప‌టివ‌ర‌కూ వీళ్ల సినిమాలు చిత్రీక‌ర‌ణ‌లు పూర్తి కాలేదు. నాగార్జున వైల్డ్ డాగ్ ని పెండింగ్ షూట్ పూర్తి చేసి తెస్తాడా? అంటే క‌ష్ట‌మేన‌ని విశ్లేషిస్తున్నారు. ప్ర‌భాస్ రాధే శ్యామ్ మాత్రం సంక్రాంతి బ‌రికి ఆస్కారం ఉంది. కానీ చూడాలి.

దిల్ రాజు ప‌ట్టుద‌ల‌తో `వీ సినిమా థియేట్రిక‌ల్ రిలీజ్ కోస‌మే వెయిటింగులో ఉంది‌. అలాగే స్ర‌వంతి మూవీస్ బ్యాక్ ఎండ్ లో ఉండ‌డం వ‌ల్ల రామ్ రెడ్ కూడా థియేట్రిక‌ల్ రిలీజ్ కోస‌మే వేచి చూస్తోంది. మైత్రి మూవీస్ ప‌ట్టుద‌ల వ‌ల్ల ఉప్పెన కూడా ఇలానే వెయిట్ చేస్తోంది. ఇవ‌న్నీ ఈ ద‌స‌రా లేదా క్రిస్మ‌స్ లేదా సంక్రాంతికి రిలీజ‌వుతాయ‌నే జ‌నాల హోప్. దేనికీ స‌రైన క్లారిటీ ఇవ్వ‌లేని క‌న్ఫ్యూజ‌న్ ప‌రిస్థితిలు ఉన్నాయి. 2021 సంక్రాంతి అయినా వీట‌న్నిటికీ మోక్షం క‌లిగిస్తుందా? అన‌్న‌దే ఇప్పుడు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో సాగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌.