Begin typing your search above and press return to search.

లండ‌న్ షేక‌య్యేలా పీసీ బి-డే సెల‌బ్రేష‌న్

By:  Tupaki Desk   |   18 July 2021 2:30 PM GMT
లండ‌న్ షేక‌య్యేలా పీసీ బి-డే సెల‌బ్రేష‌న్
X
ప్రియాంక చోప్రా తన భర్త గాయకుడు నిక్ జోనాస్‌తో కలిసి కాలిఫోర్నియాలో నివసిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రియాంక చోప్రా ప్రస్తుతం తన రాబోయే సిరీస్ సిటాడెల్ కోసం లండన్ లో ఉన్నారు. అక్క‌డే తన 39 వ పుట్టినరోజు వేడుక‌ల‌ను జ‌రుపుకున్నారు. ప్రియాంక చోప్రా తన ప్రత్యేక దినోత్సవాన్ని కజిన్ దివ్య జ్యోతి- జేమ్స్ కవనాగ్ లతో కలిసి జరుపుకున్నారు. ఈ వేడుకల నుంచి ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేశారు.

పీసీ నీలం మోనోకినిలో ఎంతో హాట్ గా క‌నిపించింది. తన ఇన్ స్టాగ్రామ్ లో వేడెక్కించే ఫోటోల‌తో అగ్గి రాజుకుంది. కొలనులో మత్స్యకన్య లా పీసీ మంట‌లు పెట్టిందంటే అతిశ‌యోక్తి కాదు. ఆ క్ష‌ణం చిల్లింగ్ గా కనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ.. అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను పీసీ జోడించింది.

పీసీ ప్ర‌స్తుతం హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. భారీ క్రేజీ యాక్ష‌న్ చిత్రం మ్యాట్రిక్స్ 4లోనూ పీసీ క‌థానాయిక‌. అలాగే సూప‌ర్ హీరోయిన్ త‌ర‌హా సిరీస్ ల‌లోనూ పీసీ న‌టించ‌నుంది. ప్ర‌ముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ‌తో క‌లిసి సినిమాలు వెబ్ సిరీస్ ల‌ను నిర్మించేందుకు పీసీ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఇవి భార‌త‌దేశంలోనూ పాపుల‌ర‌య్యేలా పీసీ ప్ర‌చారం చేస్తున్నారు.