Begin typing your search above and press return to search.

తల్లి కారణంగా ఆ ప్రముఖ నటి రేప్ కు గురైందట!

By:  Tupaki Desk   |   25 Sept 2019 10:22 AM IST
తల్లి కారణంగా ఆ ప్రముఖ నటి రేప్ కు గురైందట!
X
కంటికి రెప్పలా కాపాడాల్సిన కనురెప్పలే కంటిని కాటేస్తే? సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే తనకు ఎదురైనట్లుగా చెప్పుకొచ్చి సంచలనంగా మారారు ప్రముఖ హాలీవు్ నటి డెమీ మూర్. తన జీవితంలో చోటు చేసుకున్న ఒక దారుణమైన విషయాన్ని తాజాగా చాట్ షోలో వెల్లడించారు. టీనేజ్ లో తాను అత్యాచారానికి గురయ్యానని.. అందుకు కారణం తన తల్లేనని చెప్పి షాక్ తినేలా చేశారు.

ఆ భయంకరమైన ఘటనను తాను ఎప్పటికి మర్చిపోలేనని వెల్లడించారు. తనపై అత్యాచారం జరగటానికి కారణం తన తల్లే కారణమని.. అలాంటి ఉదంతం ఎవరికైనా ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. మద్యం కోసం 500 డాలర్లు తీసుకొని తనను బలి చేసినట్లుగా ఆమె పేర్కొంది.

ఎక్కడో ఒక మూల తన తల్లి ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉండదనే ఫీలింగ్ తనకు ఉందని.. నేరుగా ఈ ఒప్పందం జరిగి ఉండదేమోనని తాను అనుకుంటున్నట్లుగా చెప్పారు. తన టీనేజ్ లోజరిగిన దారుణ ఉదంతాన్ని తీవ్ర భావోద్వేగానికి గురై.. బయటకు చెప్పేశారు.

అయితే.. తన తల్లే తనను ఒక క్రూరమైన వ్యక్తికి అప్పగించిన విషయం తర్వాతి కాలంలో తనకు తెలిసి షాక్ తిన్నట్లు చెప్పారు. తన బాల్యం తనకో చేదు అనుభవాన్ని మిగిల్చిందన్నారు. టీనేజ్ లోనే తాను ఇంటి నుంచి బయటకు వచ్చేశానని.. చేతిలో చిల్లిగవ్వ లేదని.. హాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేద్దామనుకున్నానని.. అనుభవం లేకున్నా.. పోగొట్టుకోవటానికి ఏమీ లేదన్న తెగింపుతోనే ఎంటర్ టైన్ మెంట్ ఇండస్గ్రీలో ప్రయత్నించి సక్సెస్ అయినట్లు చెప్పారు. తన ధైర్యం.. ప్రతిభ..కష్టపడే తత్త్వమే తనను స్టార్ ను చేసినట్లుగా ఆమె వెల్లడించారు.