Begin typing your search above and press return to search.

సింగిల్ స్క్రీన్స్ లో బాల్కనీ రేట్ వంద

By:  Tupaki Desk   |   18 Feb 2016 1:30 AM GMT
సింగిల్ స్క్రీన్స్ లో బాల్కనీ రేట్ వంద
X
సినిమా థియేటర్లలో టికెట్ రేట్లు పెంచాలంటూ సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్లు.. తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాల్కనీ టికెట్ వంద రూపాయలకి పెంచడంతో పాటు, మిగిలిన మూడు క్లాసులకు కూడా ఫిక్సెడ్ రేట్లు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. నిర్మాతలు అడుగుతున్న విధానానికి థియేటర్లు కోరుతున్న పద్ధతికి చాలా తేడా ఉంది.

అవసరానికి, సినిమాకి అనుగుణంగా రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలని.. నిర్మాతలు రీసెంట్ గా ఐటీ మంత్రి కేటీఆర్ ను కోరారు. అయితే.. సినీరంగం నుంచి తగిన ప్రతిపాదనలు, సూచనలతో రావాలని ఆయన సూచించారు. నిర్మాతలు కోరినట్లుగా చేస్తే, పెద్ద సినిమాలకు ప్రయోజనం ఉంటుంది తప్ప.. థియేటర్లకు ఒరిగేదేమీ ఉండదన్నది సింగిల్ స్క్రీన్స్ అసోసియేషన్ చెబుతున్న మాట. అలాగే ప్రస్తుతం ఉన్న శ్లాబ్ సిస్టం కారణంగా.. థియేటర్లో జనాలు లేకపోయినా ఒక్కో స్క్రీన్ కి రోజుకు 10వేలు చొప్పున వినోదపు పన్ను కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు థియేటర్ ఓనర్లు.

ఇలా కాకుండా కేవలం ఆక్యుపెన్సీ రేషియో ప్రకారం పన్ను వసూలు కోరుతున్నారు. అలాగే తెలంగాణలో రూపొందుతున్న సినిమాల్లో తగిన విధంగా తెలంగాణ ఎంప్లాయీలను తీసుకోవాలని తెలంగాణ సినీ ఇండస్ట్రీ ఫెడరేషన్ కోరుతోంది. మొత్తంమీద ఇండస్ట్రీలోని పలు విభాగాలనుంచి తెలంగాణ సర్కార్ కి విన్నపాలు ఎక్కువగానే అందుతున్నాయి. ఇందులో టికెట్ రేట్లపై మాత్రం త్వరలో నిర్ణయం వెలువడనుందని తెలుస్తోంది.