Begin typing your search above and press return to search.

స్టార్ హీరో అపార్ట్ మెంట్లో డెల్టా క‌ల‌క‌లం.. బిల్డింగ్ సీజ్!

By:  Tupaki Desk   |   12 July 2021 12:35 PM GMT
స్టార్ హీరో అపార్ట్ మెంట్లో డెల్టా క‌ల‌క‌లం.. బిల్డింగ్ సీజ్!
X
క‌రోనా సెకండ్ వేవ్ నుంచి ఇంకా తేరుకోనే లేదు. థ‌ర్డ్ వేవ్ భ‌యం ఆందోళ‌న క‌లిగిస్తోంది. క‌రోనా అధికంగా ప్ర‌భావం చూపిన మ‌హారాష్ట్ర‌లో.. మ‌రోసారి వైర‌స్ పంజా విసురుతోంది. బాలీవుడ్ స్టార్ సునిల్ శెట్టి నివ‌సిస్తున్న ఓ అపార్టు మెంట్లో డెల్టా వేరియంట్ వెలుగు చూసింది. ఆ అపార్ట్ మెంట్లో మొత్తం ముగ్గురికి డెల్టా వైర‌స్ సోకిన‌ట్టుగా వైద్యులు గుర్తించారు. దీంతో.. ముంబైలో ఒక్క‌సారిగా ఆందోళ‌న వ్య‌క్త‌మైంది.

ముంబైలోని ఓ ఖ‌రీదైన ప్రాంతంలో ఉన్న అపార్ట్ మెంట్లో సునిల్ శెట్టి నివాసం ఉంటున్నారు. ఈ అపార్ట్ మెంట్లో ఉంటున్న వారిలో ముగ్గురికి డెల్టా వేరియంట్ సోకింది. దీంతో.. వెంట‌నే ముంబై మునిసిప‌ల్‌ అధికారులు స్పందించారు. ఆ అపార్ట్ మెంట్ వ‌ద్ద‌కు చేరుకొని, దాన్ని సీజ్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

బృహ‌న్ ముంబై మునిసిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు ఆ భ‌వ‌నాన్ని సీజ్ చేయ‌డంతో.. సునిల్ శెట్టి త‌న కుటుంబంతో స‌హా వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. సునిల్ శెట్టి ఇంట్లో మొత్తం న‌లుగురు ఉంటారు. అందులో ఆయ‌న భార్య‌, కూతురు అతియాశెట్టి, కుమారుడు అహాన్ శెట్టి ఉంటున్నారు. అయితే.. సునిల్ కుటుంబం మాత్రం సుర‌క్షితంగా ఉంద‌ని స‌మాచారం.

ఆ అపార్ట్ మెంట్లో ఇంకా ప‌లువురు సినీ ప్ర‌ముఖుల కుటుంబాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. ముంబై అధికారులు మాత్రం ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు రానివ్వ‌ట్లేదు. కాగా.. క‌రోనా సెకండ్ వేవ్ కాస్త త‌గ్గ‌డంతో ముంబైలో ఈ మ‌ధ్య‌నే సినిమా షూటింగులు కూడా మొద‌ల‌య్యాయి. ఇప్పుడు డెల్టా వేరియంట్‌, థ‌ర్డ్ వేవ్ ముప్పు క‌నిపిస్తుండ‌డంతో.. మ‌ళ్లీ ఆందోళ‌న మొద‌లైంది.