Begin typing your search above and press return to search.

ఢిల్లీ బ్యూటీకి భయపడుతున్నారు

By:  Tupaki Desk   |   9 Sept 2019 11:00 PM IST
ఢిల్లీ బ్యూటీకి భయపడుతున్నారు
X
ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరొయిన్లకు అవకాశాలు దొరకడం అంత సులభంగా లేదు. ఓ రెండు సక్సెస్ లు ఉంటే తప్ప మార్కెట్ జరిగే పరిస్థితి లేదు. అందం ఎంత ఉన్నా మన ఖాతాలో హిట్లు ఎన్ని ఉన్నాయనేదే ఇక్కడ కెరీర్ ని నిర్దేశిస్తుంది. అలా కాకుండా మనకు ఏదో ఒక ఆఫర్ వస్తూనే ఉండేలా చేసుకోవాలి అంటే కాక పట్టడం ఒక్కటే మార్గం. ఇప్పుడో ఢిల్లీ బ్యూటీ ఇదే మార్గాన్ని అనుసరించి డైరీ బిజీగా ఉండేలా చూసుకుంటోందట.

పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు దాటినా ఇంకా స్థిరంగా కెరీర్ సెట్ చేసుకోలేని ఓ భామకు ఇటీవలి కాలంలో వరస పరాజయాలు ఎక్కువైపోయాయి. గత ఏడాది ఓ స్టార్ ఫ్యామిలి హీరో సినిమా కోసం బరువు తగ్గి స్లిమ్ గా మారిపోయి ఓ లవ్ స్టోరీ చేస్తే అది హిట్ అవ్వడమే కాక మంచి పేరు తెచ్చింది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవకుండానే వరస పరాజయాలు పలకరించడం మొదలైపోయాయి. తమిళ్ లో చేసిన నాలుగైదు సినిమాలు కూడా తేడా కొట్టేశాయి

ఇలా అయితే లాభం లేదని భావించిన ఈ భామ ఇక్కడే హైదరాబాద్ లో స్వంత మకాం పెట్టేసింది. నేరుగా కథలు వినడం మొదలుపెట్టింది. ఈ పాత్రకు నువ్వు సరిపోవని ఓ ఇద్దరు ముగ్గురు నిర్మాతలు చెప్పినా పదే పదే ఫోన్లు చేసి ఏవేవో కబుర్లు చెప్పేసి ఫైనల్ గా మొహమాటంతో అయినా వాళ్ళతో ఓకే చెప్పించుకుని సినిమాల్లో నటించేస్తోందట.

వ్యవహారం ఎంతదాకా వచ్చిందంటే సదరు నిర్మాతల ఇళ్ళలో పూజలు విగ్రహ నిమజ్జనాలు కూడా వ్యక్తిగతంగా హాజరయ్యేంత. ఇప్పుడీ పాపకు ఆఫర్స్ ఇస్తున్న వాళ్లలో పేరున్న నిర్మాణ సంస్థలతో పాటు డిస్ట్రిబ్యూషన్ నుంచి సినిమా ప్రొడక్షన్ వైపు వచ్చిన కొత్త నిర్మాతలు కూడా ఉన్నారట. ఏదో విధంగా ఆఫర్స్ అయితే పట్టేస్తున్న ఈ ఢిల్లీ భామ తెలివి చూసి ఆశ్చర్యపోవడం తప్పించి ఎవరైనా చేయగలిగింది ఏముంది.