Begin typing your search above and press return to search.

'ఫ్యామిలీ మ్యాన్-2' లో సమంత లవ్ ట్రాక్ ని అందుకే డిలీట్ చేశారా..?

By:  Tupaki Desk   |   26 Jun 2021 4:30 AM GMT
ఫ్యామిలీ మ్యాన్-2 లో సమంత లవ్ ట్రాక్ ని అందుకే డిలీట్ చేశారా..?
X
సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్-2' ఇటీవల అమెజాన్ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. రాజీ అలియాస్‌ రాజ్యలక్ష్మి అనే తమిళ ఈలం సోల్జర్ పాత్రలో అద్భుతంగా నటించిన సామ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. యాక్షన్ సీన్స్ తో పాటుగా బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇందులో సమంత ప్రేమలో పడే కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయట. అవి కథకు అవసరం లేదని డిలీట్ చేసారని 'ఫ్యామిలీ మ్యాన్ -2' లో నటించిన షాహాబ్ అలీ వెల్లడించారు.

'ఫ్యామిలీ మ్యాన్' రెండు సీజన్లలో టెర్రరిస్ట్ గా కనిపించిన షాహాబ్ అలీ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సామ్ తో తనకు మధ్య ఉండే సీన్స్ గురించి తెలిపాడు. "సమంత నేను ప్రేమలో పడ్డామని సూచించే విధంగా ఉండే కొన్ని సన్నివేశాలలో నటించాం. అయితే మేకర్స్ లేదా ఓటీటీ ప్లాట్‌ ఫార్మ్ ఆ సీన్స్ అర్థవంతంగా లేవని భావించారేమో వాటిని తొలగించారు. అలా చాలా సన్నివేశాలు ఎడిటింగ్ లో తీసేసారు. అయినా ఇదంతా ప్రాసెస్ లో భాగమే. పెద్ద విషయమేమీ కాదు" అని షాహాబ్ అలీ చెప్పారు.

సమంత - షాహాబ్ మధ్య ఆ ప్రేమ సన్నివేశాలు తొలగించడానికి 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ పై చెలరేగిన వివాదం కారణమని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో తమిళ టైగర్స్ కు పాకిస్తాన్ టెర్రరిస్ట్ లకు సంబంధాలు ఉన్నాయనే విధంగా చిత్రీకరించారని.. తమ మనోభావాలు దెబ్బతీసిన ఈ సిరీస్ ను బ్యాన్ చేయాలని తమిళులు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెర్రరిస్ట్ పాత్రధారితో ఎల్టీటీఈ సభ్యురాలు సమంత కు మధ్య ప్రేమ పుట్టేలా చూపిస్తే మరింత కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉందని మేకర్స్ ఈ సీన్స్ డిలీట్ చేసి ఉండొచ్చు.

కాగా, దర్శకద్వయం రాజ్ & డీకే రూపొందించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత పాపురల్‌ వెబ్‌ సిరీస్ ల జాబితాలో చోటు సంపాదించింది. IMBb విడుదల చేసిన మోస్ట్ పాపులర్ షోల జాబితాలో 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' నాలుగో స్థానంలో నిలిచింది. మనోజ్ బాజ్ పాయ్ - ప్రియమణి ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సక్సెస్ ఫుల్ సిరీస్ కు కొనసాగింపుగా 'ఫ్యామిలీ మ్యాన్' మూడో సీజన్ రానుంది.