Begin typing your search above and press return to search.
సీమ ఓబులమ్మ రచ్చ రచ్చ చేస్తుందట
By: Tupaki Desk | 19 Dec 2020 11:30 AM ISTగ్లామరస్ పాత్రల్లో నటించడం వేరు.. పల్లె యువతిగా యాసను పలికిస్తూ డీగ్లామర్ రోల్ లో నటించడం వేరు. ఆ రెండోది అంత సులువేమీ కాదు. అలాంటి అవకాశం వచ్చినప్పుడే ఏ నటికి అయినా నిరూపించుకునే ఛాన్సుంటుంది. ఇప్పుడు అలాంటి ఓ అవకాశం వచ్చింది రకుల్ కి. పరేషాను అయ్యానులే.. ! అంటూ బికినీ బీచ్ లో హొయలు ఒలికించే పాత్రకు భిన్నమైన పాత్రలో నటించే అరుదైన ఛాన్స్ అందుకుంది ఈ అమ్మడు. అది క్రిష్ తెరకెక్కిస్తున్న `కొండపొలం` లో ఈ ఛాన్స్ దక్కింది.
ఈ మూవీలో రకుల్ రాయలసీమ గ్రామానికి చెందిన యువతిగా కనిపించనుంది. పూర్తిగా డీ-గ్లాం అవతార్ తో నటనకు ఆస్కారం ఉన్న పాత్ర ఇదని తెలుస్తోంది. కొండపోలం విలేజ్ డ్రామా నేపథ్యంలోని సినిమా. వైష్ణవ్ తేజ్ ఇందులో కథానాయకుడు. ఈ చిత్రం ప్రముఖ రచయిత సన్నాపురెడ్డి వెంకట్రామి రెడ్డి రచన కొండపొలం ఆధారంగా అదే టైటిల్ తో తెరకెక్కుతోంది.
కొండపోలంలో రకుల్ ఓబులమ్మ అనే సీమ యువతిగా కనిపించనుంది. రకుల్ తన అభిమానులను డి-గ్లాం అవతారంలో ఆశ్చర్యపర్చడమే కాక రాయలసీమ మాండలికంలో మాట్లాడుతూ ఆకట్టుకుంటుందట. ప్రామాణికత కోసం ప్రత్యేకించి సీమ యాసను మాండలికాన్ని నేర్చుకుంది. కొండపోలం థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉందా.. లేక OTT ప్లాట్ ఫామ్ లో రిలీజవుతుందా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది ఇంకా.