Begin typing your search above and press return to search.

'డేగల బాబ్జీ' పక్కా డిఫరెంట్‌

By:  Tupaki Desk   |   5 Oct 2021 3:30 AM GMT
డేగల బాబ్జీ పక్కా డిఫరెంట్‌
X
టాలీవుడ్ జనాలకు మరియు ప్రేక్షకులకు బండ్ల గణేష్‌ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఒక జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ ను ప్రారంభించి.. కమెడియన్ గా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మంచి పేరును దక్కించుకున్న బండ్ల గణేష్‌ ఆ తర్వాత నిర్మాతగా మారాడు. నిర్మాతగా సినిమాలు తీయడం మొదలు పెట్టిన తర్వాత నటుడిగా సినిమాలు చేయడం మానేశాడు. ఈమద్య కాలంలో ఆయన నిర్మాణంకు కాస్త బ్రేక్‌ పడింది. అందుకే ఆయన మళ్లీ నటనపై దృష్టి పెట్టాడు. ఇటీవలే మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించి నవ్వించిన బండ్ల గణేష్‌ ఈసారి పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్నాడు. తమిళంలో తెరకెక్కి సూపర్ సక్సెస్‌ ను దక్కించుకుని జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న ఒత్తు సెరుప్పు సైజు 7 రీమేక్ లో బండ్ల గణేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు అనే విషయం తెల్సిందే.

హీరోగా ఎంట్రీ ఇస్తున్న బండ్ల గణేష్‌ ఖచ్చితంగా ఈ సినిమాతో మంచి సెకండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించడం ఖాయం అని.. ఈ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలు చేస్తాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బండ్ల గణేష్‌ ఈ సినిమా చిత్రీకరణ మొదలు అయినప్పటి నుండి కూడా అంచనాలు పెంచే విధంగా స్టిల్స్ మరియు ఇతర విషయాలను షేర్‌ చేస్తూ వస్తున్నాడు. బండ్ల గణేష్‌ లుక్ ఇప్పటికే రివీల్‌ అయ్యింది. డేగల బాబ్జీ అనే విభిన్నమైన టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా నుండి మరో ఫిక్ ను బండ్ల గణేష్‌ రివీల్‌ చేయడం జరిగింది.

ఈసారి ఈ ఫొటోతో పాటు పక్కా డిఫరెంట్‌ మూవీ అనే నమ్మకంను వ్యక్తం చేశాడు. సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అతి త్వరలోనే ఈ సినిమాను ముగిస్తామని ప్రకటించాడు. వచ్చే ఏడాదికి ఈ సినిమా విడుదల అవుతుందా.. లేదంటే ముందస్తుగానే ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు బండ్ల బాబు తీసుకు వస్తాడా అనేది చూడాలి. నటుడిగా గతంలోనే బండ్ల గణేష్‌ తానేంటో నిరూపించుకున్నాడు. కాని ఒక హీరో పాత్ర చేస్తున్న నేపథ్యంలో ఈసారి ఆయన పై ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను ఎంత వరకు బండ్ల గణేష్‌ నెరవేర్చాడు అనేది చూడాలి.