Begin typing your search above and press return to search.

15 ఏళ్లు అందుకే ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంద‌ట‌!

By:  Tupaki Desk   |   10 March 2019 5:09 AM GMT
15 ఏళ్లు అందుకే ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంద‌ట‌!
X
ఇప్ప‌టి త‌రానికి పూర్తిగా కొత్త కానీ.. ప్ర‌జెంట్ ఫిఫ్టీ.. ఫార్టీ ప్ల‌స్ లో ఉన్న వారంద‌రికి అందాల భామ దీప్తి భ‌ట్నాగ‌ర్ పేరు విన్నంత‌నే పాత గురుతుల్లోకి వెళ్లిపోతారు. అప్ప‌ట్లో వ‌చ్చిన పెళ్లి సంద‌డి మూవీలో.. సౌంద‌ర్య ల‌హ‌రి అంటూ సాగే పాట‌లో ఆమె అందాలకు ఫిదా కానోళ్లు లేరు. ఆమెను త‌మ స్వ‌ప్నదేవ‌త‌గా ఫీలైన కుర్ర‌కారు భారీగానే ఉంటారు.

ప‌లు స‌క్సెస్ మూవీల్లో చేసిన ఆమె త‌న చివ‌రి మూవీ 2004 త‌ర్వాత మ‌ళ్లీ వెండితెర మీద క‌నిపించ‌లేదు. అంతేనా.. మీడియాలోనూ ఆమె ప్ర‌స్తావ‌న రాలేదు. తాజాగా ప‌లువురు ఓల్డ్ క‌థానాయిక‌ల‌తో క‌లిసి న‌టిస్తున్న కిట్టి పార్టీ మూవీలో తాజాగా రీఎంట్రీ ఇస్తున్నారు దీప్తి.

ఇంత‌కీ.. ప‌దిహేనేళ్లుగా ఇండ‌స్ట్రీకి ఎందుకు దూరంగా ఉన్నారు? అన్న ప్ర‌శ్న వేస్తే ఆమె ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు. ఈ మ‌ధ్య‌న ఆమె బుల్లితెర కోసం చేసిన యాత్రా స్పెష‌ల్ కార్య‌క్ర‌మంలో మ‌రోసారి ఫేమ‌స్ అయ్యారు. వివిద ప్రాంతాల్ని.. వాటి ప్ర‌త్యేక‌త‌ల్ని చెబుతూ వ‌స్తున్న ఈ ప్రోగ్రాం ఆక‌ట్టుకుంటోంది.

ఇంత‌కీ ప‌దిహేనేళ్లుగా వెండితెర‌కు ఎందుకు దూరంగా ఉన్నార‌న్న ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. ప్రొడ‌క్ష‌న్.. టెలివిజ‌న్ షోలు లాంటి ప‌నులు.. కుటుంబ బాధ్య‌త‌లు కూడా సినిమాలు చేసే అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని చెప్పారు. మ‌ళ్లీ సినిమాలు చేయాల‌ని అనుకున్నా సాధ్యం కాలేద‌ని.. ఇలాంటివేళ‌లో కిట్టిపార్టీ ఆఫ‌ర్ వ‌చ్చింద‌న్నారు.

ఈ మ‌ధ్య‌న ఆస్ట్రియా వెళ్లిన‌ప్పుడు అక్క‌డి ఒక ఆంధ్రా ఫ్యామిలీ త‌న‌ను గుర్తు ప‌ట్టార‌న్నారు. మా పిల్ల‌ల‌తో ఫోటో దిగుతారా? అని అడ‌గ‌ట‌మే కాదు.. ఇంటికి వెళ్లాక యూట్యూబ్ లో సౌంద‌ర్య ల‌హ‌రి పాట వాళ్ల‌కు చూపిస్తామ‌ని చెప్పారు. అది నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నిజ‌మే.. ఎప్ప‌టి పెళ్లి సంద‌డి మాట‌. అప్ప‌టి పాట‌ను.. దీప్తిని గుర్తు పెట్టుకొని మ‌రీ ప్ర‌స్తావిస్తే ఏ న‌టికైనా ఆనందం క‌ల‌గ‌దు మ‌రి.