Begin typing your search above and press return to search.

యాభై దాటినా గుబులు రేపుతున్న‌ అందాల న‌టి

By:  Tupaki Desk   |   27 Aug 2021 6:44 AM GMT
యాభై దాటినా గుబులు రేపుతున్న‌ అందాల న‌టి
X
అందాల ఆరోబోత‌కు వ‌య‌సు తో సంబంధం లేదని చాలా మంది బాలీవుడ్ న‌టీమ‌ణులు నిరూపించారు. వ‌య‌సుతో ప‌ని లేకుండా హాటెస్ట్ ఫోటోషూట్స్ తో విరుచుకుప‌డుతున్న సీనియ‌ర్ నాయిక‌లు చాలా మంది ఉన్నారు. ఐటం గాళ్స్ గా చలామ‌ణిలో ఉన్న చాలా మంది వ‌య‌సు రీత్యా 50కి చేరువ‌లో ఉన్న భామ‌లే. భామల్లో గుబులు రేపే సెగ‌లు చూస్తే కాక‌లు పుట్టాల్సిందే.. మ‌లైకా ఆరోరా.. చిత్రాంగ‌దా సింగ్.. ఊర్మిళ స‌హా చాలా మంది భామ‌లు వ‌య‌సుతో సంబంధం లేకుండా ర‌చ్చ చేస్తున్నారు. తాజాగా ఉత్త‌రాది న‌టి దీప్తీ భ‌ట్నాగ‌ర్ కూడా అందుకు మిన‌హాయింపేం కాద‌ని నిరూపించింది. `పెళ్లి సంద‌డి` సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ వెట‌ర‌న్ న‌టి దీప్తి సుప‌రిచితురాలే.

ఆ త‌ర్వాతా టాలీవుడ్ లో `ఆటో డ్రైవ‌ర్`..`సుల్తాన్`..`మా అన్న‌య్య` లాంటి సినిమాల్లో న‌టించింది. బాలీవుడ్ లోనూ కొన్ని సినిమాల్లో న‌టించింది. అయితే ఆమె ప‌రిశ్ర‌మ‌కు దూర‌మై 13 ఏళ్ల‌కు పైగానే అయింది. ఇటీవ‌ల కె.రాఘ‌వేంద్ర‌రావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్ వారుసుడు రోషన్ తో `పెళ్లి సంద‌-డి` సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లో దీప్తి అనూహ్యంగా ప్ర‌త్య‌క్ష‌మైంది. అప్ప‌టి ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

తాజాగా దీప్తి భ‌ట్నాగ‌ర్ ఓ హాటెస్ట్ ఫోటో షూట్ తో అభిమానుల‌కు ట‌చ్ లోకి వ‌చ్చింది. దీప్తి వ‌య‌సు 53 ఏళ్లు. అయినా 30 మైన‌స్ హీరోయిన్ లా మేక‌ప్ తో గ్లామ‌ర‌స‌గ్ గా మారిపోయింది. ఈ ఫోటోగ్రాఫ్ కి బ్యూటీ ఈజ్ ఓన్లీ స్కిన్ డీప్ అంటూ ఓ కొటేష‌న్ కూడా ఇచ్చింది. అందం అనేది ఛ‌ర్మ‌కాంతిలోనే.. అంటూ..ఇలా త‌న స్కిన్ షోని ఎలివేట్ చేసింది. ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ ఫోటో వైర‌ల్ గా మారింది. దీంతో నెటిజ‌నుల కామెంట్లు హీటెక్కిస్తున్నాయి.

53 వ‌య‌సులోనే దీప్తి కాక‌లు పుట్టిస్తోందంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. అవును అందానికి వ‌య‌సుతో ప‌నిలేద‌ని మ‌రో ఫ్యాన్ కామెంట్ చేసాడు. మొత్తానికి దీప్తి లేటు వ‌య‌సులో ఘాటు అందాల‌తో పిచ్చెక్కించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాశంగా మారింది. మ‌రి ఇదే స్పీడ్ లో మ‌ళ్లీ సినిమాల్లోకి కం బ్యాక్ అవుతుందా? అన్న‌ది చూడాలి. 13 ఏళ్ళ గ్యాప్ ని ఫుల్ ఫిల్ చేసేలా న‌టిగా మళ్లీ బిజీ అవ్వాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

బికినీల‌తోనూ దీప్తి ర‌చ్చ మామూలుగా లేదే

శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్ హీరోగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించిన పెళ్లి సంద‌డి సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. 90ల‌లో మ్యూజిక‌ల్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇక ఈ మూవీలో క‌థానాయిక‌లుగా న‌టించిన ర‌వళి- దీప్తి భ‌ట్నాగ‌ర్ ల‌ను తెలుగు ఆడియెన్ ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేదు. అందునా ధీప్తి భ‌ట్నాగ‌ర్ నాటి యూత్ కి వెరీ స్పెష‌ల్. దీప్తి నాభి సొగ‌సును ఆ దిగువ మ‌చ్చ‌ను కూడా అంత తేలిగ్గా మ‌రువ‌డం క‌ష్టం. ఉత్త‌రాది బ్యూటీ ధీప్తి భ‌ట్నాగ‌ర్ ని అంత అందంగా ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కేంద్రుడు. దీప్తి స్మైలీ ఫేస్ ని కూడా తెలుగు అభిమానులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఇక పెళ్లి సంద‌డికి కీర‌వాణి అందించిన సంగీతం అంతే పెద్ద అస్సెట్ అయ్యింది.

అయితే పెళ్లి సంద‌డి బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా కానీ దీప్తి భ‌ట్నాగ‌ర్ తెలుగులో ఎక్కువ సినిమాలు చేయ‌లేదు. 1996లో పెళ్లి సంద‌డి రిలీజైతే ఇప్ప‌టికి శ్రీ‌కాంత్ వార‌సుడు రోష‌న్ హీరోగా అదే టైటిల్ తో రాఘవేంద్ర‌రావు సార‌థ్యంలో పెళ్లి సంద‌-డి లో అతిథిగా త‌ళుక్కుమంటార‌ట‌. దీప్తి ఇటీవ‌ల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. 53 ఏజ్ .. త‌న‌కు హీరో అయ్యేంత కొడుకు ఉన్నా.. ఇప్ప‌టికీ వేడి త‌గ్గ‌నే లేద‌ని త‌న ఇన్ స్టా పోస్టులు చూస్తే అర్థ‌మ‌వుతోంది. దీప్తీ భట్నాగర్ ర‌క‌ర‌కాల బికినీల్లో ఫోజులివ్వ‌గా అవ‌న్నీ ఇన్ స్టాలో వేడెక్కిస్తున్నాయి. బిజినెస్ మేన్ నీలి కృష్ణను దీప్తి పెళ్లాడారు. ఈ జంట‌కు ఇద్ద‌రు వార‌సులు ఉన్నారు.