Begin typing your search above and press return to search.

ఫిట్నెస్ ట్రైన‌ర్ దీపిక ఏం నేర్పిస్తోంది ఇంత‌కీ?

By:  Tupaki Desk   |   14 Aug 2021 3:30 AM GMT
ఫిట్నెస్ ట్రైన‌ర్ దీపిక ఏం నేర్పిస్తోంది ఇంత‌కీ?
X
పికా పదుకొనే- సిద్ధాంత్ చతుర్వేది - అనన్య పాండే వారాంతంలో ఫుల్ సెల‌బ్రేష‌న్ మోడ్ లో క‌నిపించడానికి ఒక ప్ర‌త్యేక‌ కారణం ఉంది. నేటితో తాము న‌టిస్తున్న శకున్ బాత్రా మూవీ చిత్రీక‌ర‌ణ ముగిసింది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రం గత కొన్ని వారాలుగా ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. దీపిక అనేక సార్లు లొకేషన్ నుంచి ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి.

షూటింగ్ పూర్త‌యిన అనంత‌రం శకున్ త‌న ఆర్టిస్టులందరితో సెల‌బ్రేష‌న్ జరుపుకోవడానికి ప్రిపేర‌య్యారిలా. ఇప్పుడు ఆన్ లొకేష‌న్ నుంచి కొన్ని ఫోటోలు వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. దీపిక- సిద్ధాంత్-అనన్య ఈ ఫోటోల‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.

దీపికా పదుకొనే అభిమాన సంఘం షేర్ చేసిన వీడియోలో శకున్ తన సినిమా ముగింపులో కేక్ కట్ చేసే ముందు ప్రసంగించారు. ఇత‌ర టీమ్ ద‌ర్శ‌కుడితో ఎంతో ఛీర‌ప్ మూడ్ లో క‌నిపిస్తున్నారు. ప్రసంగం చివరలో అతనిని ఉత్సాహపరుస్తూ క‌నిపించారు. శకున్ తన సిబ్బందికి తారాగణానికి స‌మాధాన‌మిస్తూ.., ``నాకు ఇంకా కొంత పని మిగిలి ఉంది, .. కానీ మంచి ఫ‌లితం ద‌క్కుతుంది`` అంటూ పోస్ట్ చేశారు.

శకున్ లాంటి తెలివైన ద‌ర్శ‌కుడితో క‌లిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉంది. అతను దర్శకత్వం వహించే విధానం .. తార‌ల నుంచి అతను ప్ర‌తిభ‌ను రాబట్టిన విధానం న‌టీన‌టులు అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఈ సినిమా కోసం వేచి చూడ‌లేం.. అంటూ దీపిక ప్ర‌శంస‌లు కురిపించింది.

ఒక సంక్లిష్ట సంబంధాల డ్రామాగా ఉండే ఈ చిత్రంలో దీపిక‌ ఫిట్ నెస్ బోధకుడి పాత్రను పోషిస్తోంది. `URI: ది సర్జికల్ స్ట్రైక్` లో కనిపించిన ధైర్య కర్వా- అనన్య- దీపిక - సిద్ధాంత్ లు కూడా సినిమాలో ఒక‌ భాగం. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌లేదు. ధర్మ ప్రొడక్షన్స్ సాయంతో ఇది రిలీజ‌వుతోంది.