Begin typing your search above and press return to search.

నిర్మాత శ్రేయ‌స్సు కోరిన ఏకైక లేడీ సూప‌ర్ స్టార్

By:  Tupaki Desk   |   4 Sept 2020 10:00 AM IST
నిర్మాత శ్రేయ‌స్సు కోరిన ఏకైక లేడీ సూప‌ర్ స్టార్
X
ఈరోజుల్లో కూడా ఇలాంటి వాళ్లు ఉంటారా? .. దీపం ఉండ‌గానే చ‌క్కదిద్దుకునే ల‌ల‌నామ‌ణుల్లో కొంద‌రు నిర్మాత వైపు నుంచి కూడా ఆలోచిస్తారా? అంటే.. ఎందుకు ఉండ‌రు?

కొంద‌రు క‌థానాయిక‌లు అస‌లు సినిమాల ప్ర‌మోష‌న్స్ కి వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డ‌రు. సౌత్ లో ఒక సూప‌ర్ హీరోయిన్ స‌సేమిరా అనేస్తారు. అది వంద కోట్ల బ‌డ్జెట్ సినిమా అయినా ప‌ట్టించుకోరు. కానీ బాలీవుడ్ కి చెందిన ఆ సూప‌ర్ లేడీ మాత్రం నిర్మాత శ్రేయ‌స్సును కోరుకుని త‌న విధేయ‌త‌ను చాటుకోవ‌డం టాలీవుడ్ స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇంత‌కీ ఎవ‌రామె? అంటే.. ఇంకెవ‌రు.. ప‌ద్మావ‌త్ 3డి నాయిక దీపిక ప‌దుకొనే.

ఇటీవ‌లే ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించేందుకు అంగీక‌రించిన దీపిక ఏకంగా 20కోట్లు డిమాండ్ చేసింద‌ని.. ఏరియా హ‌క్కులు అడిగింద‌ని ప్ర‌చార‌మైంది. ఇక భారీ మొత్తంలో అడ్వాన్స్ అందుకుంద‌ని కూడా ప్ర‌చార‌మైపోయింది. అయితే ఇందులో కొంత నిజం ఉన్నా.. అడ్వాన్స్ చెల్లించారు! అన్న‌దాంట్లో ఎలాంటి నిజం లేదు. దీపిక‌కు అశ్వ‌నిద‌త్ బృందం కోటి అడ్వాన్స్ ముట్ట జెప్పార‌న్న టాక్ ఉంది. కానీ అది నిజం కాదట‌. అడ్వాన్స్ అందుకునేందుకు దీపిక స‌సేమిరా అనేసింద‌ట‌. ఎందుకంటే ప్ర‌స్తుత మ‌హ‌మ్మారీ స‌న్నివేశంలో ఏ సినిమా టేకాఫ్ అవుతుంది? అన్న‌ది చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇలాంటి క్రిటిక‌ల్ స‌న్నివేశంలో అడ్వాన్సులు తీసుకుని ఇబ్బంది పెట్ట‌డం స‌రికాద‌ని భావించి నో చెప్పింద‌ట‌. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ సినిమాని ప్రారంభించేస్తే న‌టించేందుకు తాను సిద్ధ‌మేన‌ని ఎంతో విన‌మ్రంగా చెప్పింద‌ట దీపిక‌.

సినిమా తెర‌కెక్కి మార్కెట్ వ‌ర్గాల్లో టాక్ వేడెక్కిస్తే.. థియేట్రిక‌ల్ రిలీజ్ ప‌ర‌మైన ఇబ్బందులేవీ లేక‌పోతే నిర్మాత భారీ పారితోషికాలు చెల్లించ‌గ‌ల‌రు! అన్న కామ‌న్ సెన్స్ కూడా దీపిక వ్య‌క్తం చేసింద‌ట‌. భ‌ళారే.. క‌థానాయిక‌ల్ని ఎప్పుడూ ఒకే కోణంలో చూడ‌కూడ‌దు. ఎందుకంటే దీపిక కూడా ఒక నిర్మాత‌నే క‌దా? త‌ను నిర్మించిన చ‌పాక్ ఇంత‌కుముందు రిలీజైంది. 83 మూవీ కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. అందుకే అవ‌గాహ‌న‌తో ప్ర‌తిదీ ప్లాన్ చేస్తోంద‌న్న‌మాట‌. మొత్తానికి నిర్మాత శ్రేయ‌స్సు కోరిన ఏకైక లేడీ సూప‌ర్ స్టార్ గా దీపికను పొగిడేస్తే త‌ప్పేమీ కాదు!