Begin typing your search above and press return to search.

ఐడెంటిటీ కోసం పాప ఎన్ని తిప్పలు పడుతుందో..!

By:  Tupaki Desk   |   7 Jan 2023 4:52 AM GMT
ఐడెంటిటీ కోసం పాప ఎన్ని తిప్పలు పడుతుందో..!
X
టిక్ టాక్ తో పాపులర్ అయ్యి ఢీ డాన్స్ షోలో మెంటర్ గా వచ్చిన దీపికా పిల్లి ఆ షో ద్వారా స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ని అలరించింది. ఢీ లో ఒక సీజన్ తో క్రేజ్ తెచ్చుకోగానే స్టార్ మాకి షిఫ్ట్ అయ్యి కామెడీ స్టార్స్ కి యాంకర్ గా చేసింది. ప్రస్తుతం ఆహా కామెడీ స్టాక్ ఎక్సేంజ్ షోలో సుధీర్ తో పాటుగా యాంకరింగ్ చేస్తుంది. ఓ పక్క షోస్ చేస్తూనే తన ఫోటో షూట్స్ తో హాట్ టాపిక్ గా మారుతుంది దీపిక పిల్లి. హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ గాని అమ్మడు తన గ్లామర్ ఎటాక్ తో ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటుంది.

యాంకరింగ్ తో పాటుగా ఫోటో షూట్ తో రెచ్చిపోతున్న దీపిక సినిమా ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తుంది. అతి తక్కువ కాలంలోనే యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న దీపికా ఆల్రెడీ వాంటెడ్ పండుగాడ్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా ఆమెకు అంతగా పేరు తెచ్చిపెట్టలేదు.

అందుకే ఫాలోవర్స్ లో తన ఐడెంటిటీ పెంచుకునేందుకు రకరకాల ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది దీపిక. మాల్దీవ్స్ లో దీపిక పిల్లి ఫోటో షూట్స్ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అమ్మడు రెచ్చిపోవడం చూసి ఆడియన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.

సరైన ఛాన్స్ వస్తే దీపిక తన టాలెంట్ చూపించేందుకు రెడీ అంటుంది. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువగా రాణిస్తుంటారు. అయితే ఈమధ్య ట్రెండ్ మారింది. ఇప్పుడు తెలుగు అమ్మాయిలకు ఇక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి.

ఈ లిస్ట్ లో దీపిక పేరు కూడా చేరబోతుందని చెప్పొచ్చు. అమ్మడికి సరైన సినిమా ఒకటి పడితే మాత్రం తప్పకుండా తన టాలెంట్ ప్రూవ్ చేసుకునేలా ఉందని చెప్పొచ్చు. ఆల్రెడీ తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేస్తుంది కాబట్టి వెండితెర మీద తన వయ్యారాలతో కూడా అలరించే ఛాన్స్ ఉంది.

దీపిక చేస్తున్న ఈ ఫోటో షూట్ ప్రయత్నాలన్నీ ఆమె గ్రాఫ్ పెరిగేందుకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. రీసెంట్ గా హరీశ్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్స్ కూడా తెలుగు అమ్మాయిలైతే తమకు చాలా కంఫర్ట్ గా ఉంటుందని అన్నారు. సో ఎలా చూసినా దీపికకు రానున్న రోజుల్లో మంచి ఛాన్స్ లు వస్తాయని చెప్పొచ్చు. అప్పటిదాకా తన క్రేజ్ తగ్గకుండా దీపిక సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో వార్తల్లో నిలుస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.