Begin typing your search above and press return to search.

హ‌బ్బీతో ఐంటం సాంగ్..దీపిక ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారా?

By:  Tupaki Desk   |   9 Dec 2022 5:21 AM GMT
హ‌బ్బీతో ఐంటం సాంగ్..దీపిక ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారా?
X
హాట్ బ్యూటీ దీపికా ప‌దుకొణే పెళ్లైనా స‌రే త‌గ్గేదేలే అంటూ బాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఆమ‌ధ్య రిలీజ్ అయిన 'గెహ్రాయాన్' చిత్రంలో ఏ రేంజ్ లో చెల‌రేగిందో తెలిసిందే. హీరోతో ఇంటిమేట్ స‌న్నివేశాలు..లిప్ లాక్ లు..స్కిన్ షోతో అద‌ర‌గొట్టేసింది. పెళ్లైనా ఇవేం సినిమాల‌ని విమ‌ర్శ‌లొచ్చినా? వాటిని ధీటుగా ఎదుర్కుని ధైర్యంగా నిల‌బ‌డింది. వాటికి త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చింది.

అలాగే ఇటీవ‌ల రిలీజ్ అయిన 'ప‌ఠాన్' టీజ‌ర్ లోనూ అమ్మ‌డు అందాలు ఓ రేంజ్ లో ఆర‌బోసిన‌ట్లు తెలుస్తోంది. ఆల్ర్టా గ్లామ‌ర‌స్ బికినీలో అగ్గిరాజేసింది. పరాయి హీరోల‌తోనూ రొమాన్స్ విష‌యంలో ఈ రేంజ్ లో రెచ్చిపోయిందంటే? త‌న హ‌బ్బీ ర‌ణ‌వీర్ తో ఇంకే రేంజ్ లో చెల‌రేగి ఉటుంద‌ని అభిమానులంతా ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి ఆ ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి రొమాన్స్ పండిందో తెలియాలంటే మ్యాట‌ర్లోకి వెళ్లాల్సిందే.

ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా న‌టిస్తోన్న 'సిర్క‌స్' లో దీపిక ఐటం సాంగ్ అని బ‌య‌ట‌కు రాగానే కుర్రాళ్లు ఊహాలు..ఆశ‌ల‌కు అదుపులేకుండా పోయింది. ఓ రేంజ్ లో దార‌బోస్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు.

కానీ అన్నింటిని ఒక్క క్ష‌ణంలోనే నీరుగార్చేసింది దీపిక‌. తాజాగా సిర్క‌స్ నుంచి క‌రెంట్ లాగారే సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో ర‌ణ‌వీర్ తో క‌లిసి దీపిక పెర్పార్మెన్స్ చేసింది.

కానీ ఎక్క‌డా రొమాంటిక్ సీన్ లేదు. స్కిన్ షో లేదు. లిప్లాక్లు ల్వేవ్. పాటంతా డీసెంట్ గా ఉంది. పాట‌లో ఏ మాత్రం అతి లేదు. భార్యాభ‌ర్త‌లిద్ద‌రు కేవ‌లం పెర్పార్మెన్స్ పైనే దృష్టి పెట్టి ప‌నిచేసారు. ఇద్ద‌రి ఆహార్యం ఆక‌ట్టుకుంటుంది. ర‌ణ‌వీర్ ఫ‌న్నీ స్టెప్పులు ఆద్యంతం వినోద ప్రియుల్ని అల‌రిస్తున్నాయి. త‌న‌దైన హావ‌భావాల‌తో ఆక‌ట్టుకున్నాడు ర‌ణ‌వీర్.

దీపిక కూడా చాలా సెటిల్డ్ ఔట్ ఫుట్ ఇచ్చింది. త‌మిళ్ గాళ్ లుక్ లో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. దీపిక అభిమానులు అమ్మ‌డి స్టెప్పుల‌కు ఫిదా అవుతున్నారు. ఐటం సాంగ్ అంటే అందాలు మాత్ర‌మే చూపించాలా? ప‌ద్ద‌తిగా డాన్స్ చేసి కూడా మెప్పించ వ‌చ్చు అని దీపిక‌-ర‌ణ‌వీర్ జోడి నిరూపించింది. డై హార్డ్ అభిమానుల‌కు ఈ పాట ఓ ఫీస్ట్ లా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.