Begin typing your search above and press return to search.

`ఫైట‌ర్` కోసం కిల్ల‌ర్ లా మారిన దీపిక ప‌దుకొనే

By:  Tupaki Desk   |   8 July 2021 8:00 PM IST
`ఫైట‌ర్` కోసం కిల్ల‌ర్ లా మారిన దీపిక ప‌దుకొనే
X
కిల్ల‌ర్ లుక్ తో కిల్ చేయ‌డ‌మెలానో దీపిక ప‌దుకొనేకి తెలిసినంత‌గా వేరొక‌రికి తెలీదేమో. తాజాగా దీపిక ప‌దుకొనే స‌రికొత్త ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వ‌చ్చింది. ఈ ఫోటోషూట్ లో బేసిక్ ఇన్ స్టింక్ట్స్ భామ ష‌రాన్ స్టోన్ ని త‌ల‌పిస్తోంది. తాజా ఫోటోషూట్ లో దీపిక పొడుగు కాళ్ల సౌంద‌ర్యం హైలైట్ గా నిల‌వ‌గా.. జెల్ హెయిర్ స్టైల్ తో వెట్ లుక్ లో హీట్ పెంచింది. బ్లాక్ ఐ లైన‌ర్ బ్లాక్ హెయిర్ తో మైమ‌రిపించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ వైర‌ల్ గా మారింది.

మ‌రోవైపు దీపిక ఇండియన్ సినిమా హిస్ట‌రీలో మునుపెన్న‌డూ రాని సూప‌ర్ హీరో త‌ర‌హా చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమా టైటిల్ ఫైట‌ర్. హృతిక్ రోషన్ క‌థానాయ‌కుడు. ఫైటర్ భారతదేశపు మొదటి వైమానిక యాక్షన్ ఫ్రాంచైజ్ గా చ‌రిత్ర సృష్టించ‌బోతోంది. సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. తాజాగా హృతిక్ 47వ పుట్టినరోజు సందర్భంగా మూవీ లుక్ విడుద‌లైంది.

భారతదేశపు మొదటి వైమానిక యాక్షన్ ఫ్రాంచైజీ అన‌గానే స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. వార్ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ నుంచి మ‌రో క్లాసిక్ యాక్ష‌న్ మూవీని వీక్షించే వీలుంద‌ని అంచ‌నాలేర్ప‌డుతున్నాయి.

హృతిక్ రోషన్ - దీపికా పదుకొనే జోడీ `ఫైటర్` ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించారు. ఇప్పుడు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్ష్ ఈ చిత్రం గురించి ట్వీట్ లో కొత్త వివ‌రం చెప్పారు. దీనిని వయాకామ్ 18 స్టూడియోస్- మమతా ఆనంద్- రామోన్ చిబ్ -అంకు పాండే నిర్మిచ‌నున్నారు. హృతిక్ చివరి విడుదల వార్.. బాలీవుడ్ లో అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.

ఈసారి అంత‌కుమించి గొప్ప ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు సిద్ధార్థ్- హృతిక్ జోడీ. ప్రపంచ ప్రేక్షకుల కోసం భారీ స్థాయిలో ఫైటర్ ని నిర్మించ‌నున్నారు. అదే సమయంలో భారతీయ మూలాలను ఈ సినిమా క‌థ‌లో విస్మ‌రించ‌రు. మన సాయుధ దళాల శౌర్యం- త్యాగం -దేశభక్తిని ఇందులో ప్ర‌ద‌ర్శిస్తారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ, “ఫైటర్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్,.. అజిత్ ..వయాకామ్ సిఒఒ దృష్టితో ఎవరైనా నాతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంతో యాక్షన్-ప్రియులైన‌ గ్లోబల్ ప్రేక్షకుల కోసం మ‌లిచిన‌ భారతీయ చిత్రంగా చూడాల‌నుకుంటున్నాను.. అని అన్నారు.

నిర్మాత‌ల్లో ఒక‌రైన‌ అజిత్ మాట్లాడుతూ.. టాప్ గన్ అభిమానిగా,.. మన స్వంత ట్రూ-బ్లూ ఏరియల్ యాక్షన్ ఫిల్మ్ ను అభివృద్ధి చేయడం ఒక కల. మేము సంవత్సరాలుగా ఈ విషయంపై స్క్రిప్ట్ ల కోసం వెతుకుతున్నాం. కాక్ పిట్ లో హృతిక్ నటించాలని ఊహించగా దీపిక ఈ కథకు కొత్త కోణాన్ని తెస్తుంది. ఈ ఫ్రాంచైజీని నిర్మించడంలో సిద్ధార్థ్ తో భాగస్వామి కావడానికి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే అతను ఈ తరానికి చెందిన క్రాఫ్ట్ - పల్స్ తో సరైన మిశ్రమాన్ని తెస్తాడు. భారతీయ సినిమాను పునర్నిర్వచించటానికి సాహసోపేతమైన చర్యలు తీసుకునే సంప్రదాయం మాకు ఉంది. ఆ ప్రయాణంలో ఇది ఒక మైలురాయి చిత్రం అవుతుంది`` అని అన్నారు.

హృతిక్ రోషన్ 47 వ పుట్టినరోజు సందర్భంగా ఫైటర్ మేకర్స్ ఈ చిత్రాన్ని మొదట ప్రకటించారు. హృతిక్ స్వయంగా సోషల్ మీడియాలో సిద్ధార్థ్ ఆనంద్ ప్రొడక్షన్ హౌస్ మార్ఫ్లిక్స్ - దీపికా పదుకొనే గురించి స్వీట్ నోట్ తో ఫైటర్ మోషన్ పోస్టర్ ను పంచుకున్నారు.

ఫైటర్ మొదటిసారి బాలీవుడ్ డ్రీమ్ స్టార్లు ఇద్దరిని కలుపుతోంది. హృతిక్ -దీపిక జంట క‌ల‌యిక కోసం చాలా కాలంగా క‌థ‌నాలొచ్చినా ఇదే తొలి ఛాయిస్. ఫైటర్ క‌థాంశం గురించి పెద్దగా తెలియకపోయినా హృతిక్ రోషన్ 2019 బ్లాక్ బస్టర్ వార్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ సిద్ధార్థ్ ఆనంద్ మిగతా వాటికి భిన్నంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ తెర‌కెక్కించే ప్లాన్ తో ఉన్నారు. ఇప్పుడు, తరణ్ ఆదర్శ్ వెల్లడి ఖచ్చితంగా దానిని ధృవీకరించింది. సిద్ధార్థ్ కూడా ఫైటర్ నిర్మాత‌ల్లో ఒక‌రు. ఈ చిత్రం సెప్టెంబర్ 2022 లో విడుదల కానుంది.