Begin typing your search above and press return to search.

మ్యాడ‌మ్ స్పీడ్ ని డార్లింగ్ త‌ట్టుకోగ‌లడా?

By:  Tupaki Desk   |   21 July 2020 10:00 AM IST
మ్యాడ‌మ్ స్పీడ్ ని డార్లింగ్ త‌ట్టుకోగ‌లడా?
X
టాలీవుడ్ - బాలీవుడ్ స్టార్ల క‌ల‌యిక‌లో సినిమాలు తీయ‌డం అంటే అంత వీజీ కాదు. బ‌య‌టికి తెలియ‌ని చాలా సంగ‌తులే ఉంటాయి. ముఖ్యంగా ఉత్త‌రాది వాళ్లు ద‌క్షిణాదిపై డామినేష‌న్ కోరుకుంటారు. మ‌న‌ల్ని ఒక‌ర‌కంగా చిన్న చూపు చూడ‌డం అనాదిగా ఉన్న‌దే. సినీరంగంలో ఇది మ‌రీ ఎక్కువ‌. ఆమాత్రం స్టార్ డ‌మ్ ఉన్న తార‌లు అయితే ఇక్క‌డ హీరోల్ని కూడా డామినేట్ చేయాల‌న్న పంతంతో ఉంటారు. ఆ సంగ‌తి తాజాగా దీపిక ప‌దుకొనే యాక్ట్ ఓపెన్ గానే ప్రూవ్ చేసింది. ``ప్ర‌భాస్ 21 అనేది సినిమా టైటిల్ కాదు.. కేవ‌లం ప్ర‌భాస్ న‌టించే 21వ సినిమా.. నోట్ దిస్ పాయింట్`` అంటూ ప్ర‌భాస్ ని త‌గ్గించే ప్ర‌య‌త్న‌మే చేసింద‌ని సామాజిక మాధ్య‌మాల్లో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప్ర‌భాస్ 21 క‌థానాయిక‌గా త‌న డామినేష‌న్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌న్న పంతం దీపిక‌లో క‌నిపించింది.

అయితే దీపిక‌కు అంత సీన్ ఉందా? అన్న‌ది విశ్లేషిస్తే.. పురుషాధిక్య‌త అధికంగానే ఉండే బాలీవుడ్ లోనూ దీపికకు ఆ త‌ర‌హా ఇబ్బందులెన్నో ఎదురై అనుభ‌వ పూర్వ‌కంగా రాటుదేలింది. అక్క‌డ లేడీ సూప‌ర్ స్టార్ గా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకునేందుకు ద‌శాబ్ధాల కాలమే ప‌ట్టింది. ఇక ప‌ద్మావ‌త్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంలో న‌టించిన ఘ‌న‌త త‌న‌కే చెల్లింది. నాయికా ప్ర‌ధాన క‌థ‌తో భ‌న్సాలీ లాంటి ద‌ర్శ‌కుడు ఈ సినిమాని తెర‌కెక్కించి స‌క్సెస్ చేశారు. ఇక ఈ మూవీ వ‌ల్ల దీపిక పేరు ర‌క‌ర‌కాల వివాదాల‌తో మార్మోగిపోయింది. రాజ్ పుత్ రాణిగా న‌టిస్తున్న దీపిక‌ను చంపేస్తామ‌ని రాజ్ పుత్ లు బెదిరించ‌డంతో త‌న పేరు ప‌దే ప‌దే మీడియాలో హైలైట్ అయ్యింది.

ఇటీవ‌ల చ‌పాక్ సినిమా రిలీజ్ స‌మ‌యంలోనూ జ‌వ‌హ‌ర‌ల్ లాల్ నెహ్రూ యూనివ‌ర్శిటీ విద్యార్థుల‌కు సంఘీభావం తెలిపి పొలిటిక‌ల్ ప్ర‌త్య‌ర్థుల ఆగ్ర‌హానికి గురైంది. ఆ క్ర‌మంలోనే ప‌దే ప‌దే జాతీయ మీడియాలో దీపిక పేరు మార్మోగింది. ప్ర‌తిసారీ ఇలాంటి ఏదో ఒక వివాదం కొని తెచ్చుకోవ‌డం ప్ర‌చారం చేయించుకోవ‌డంలో దీపిక త‌క్కువేమీ కాద‌ని ప్రూవైంది. ప‌ద్మావ‌త్ రిజ‌ల్ట్ త‌ర్వాత దీపిక లేడీ సూప‌ర్ స్టార్ గా అవ‌త‌రించింద‌ని త‌న‌కు ఎదురేలేద‌ని ఒక పెద్ద ప్ర‌చారం జ‌రిగిపోయింది. అందుకే ఇప్పుడు ఈ అమ్మ‌డు ఏమాత్రం మెట్టు దిగ‌డం లేదు. బాహుబ‌లి స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న అవ‌కాశం వ‌చ్చినా కానీ త‌న రేంజ్ ఎక్క‌డా త‌గ్గ కూడ‌ద‌న్న పంతం త‌న‌లో క‌నిపిస్తోంది. ప్ర‌చార సామాగ్రి స‌హా ప్ర‌తిదాంట్లో త‌న డామినేష‌న్ కావాల‌నే కోరుకుంటోంది.

అయితే వీట‌న్నిటికీ భిన్న‌మైన వ్యక్తిత్వం ప్ర‌భాస్ ది. అస‌లే ప‌బ్లిసిటీ అంటేనే గిట్ట‌దు. అస‌లు మీడియాల్లోనే పెద్దంత‌గా క‌నిపించ‌డు. మొన్న బాహుబ‌లి 1.. బాహుబ‌లి 2.. సాహో చిత్రాలు పాన్ ఇండియా రేంజ్ కాబ‌ట్టి మీడియా ముందుకు వ‌చ్చాడు. అది కూడా చాలా సిగ్గుప‌డుతూనే. మ‌రి దీపిక లాంటి సిగ్గులేని ప‌బ్లిక్ స్టార్ తో అత‌డు పోటీప‌డ‌గ‌ల‌డంటారా? ఇదే ఇప్పుడు పెద్ద చిక్కు ప్ర‌శ్న‌.