Begin typing your search above and press return to search.

`ప్ర‌భాస్ 21` టైటిల్ .. దీపిక మ‌న‌స్తాపం!?

By:  Tupaki Desk   |   20 July 2020 10:15 AM IST
`ప్ర‌భాస్ 21` టైటిల్ .. దీపిక మ‌న‌స్తాపం!?
X
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్న 21వ సినిమాకి సంబంధించిన ఒక్కో అప్ డేట్ వేడి పెంచుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ ని పాన్ ఇండియా నుండి పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ గా ప్ర‌మోట్ చేసేందుకు వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వ‌నీద‌త్ కంక‌ణం క‌ట్టుకున్నారు. బాహుబ‌లి ఫ్రాంచైజీతో ఆర్కా మీడియా చేసిన సాహ‌సాన్ని మించి ద‌త్ సాహ‌సిస్తారా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అల్లుడు నాగ్ అశ్విన్ అంత ప్ర‌తిభావంతంగా సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశాన్ని తెర‌పైకి తెచ్చి స‌త్తా చాటుతారా? అన్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.

ఈ త‌ర‌హా ఆస‌క్తిక‌ర డిబేట్ న‌డుమ ఉన్న‌ట్టుండి అనూహ్యంగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక ప‌దుకొనేను ప్ర‌భాస్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ఎంపిక చేసి ద‌త్ బృందం పెద్ద‌ షాకిచ్చారు. `ప‌ద్మావ‌త్` చిత్రంతో 600 కోట్ల క్ల‌బ్ సినిమాలో న‌టించిన ఏకైక నాయిక‌గా సంచ‌ల‌నాలు సృష్టించిన దీపిక సెలెక్ష‌న్ తో పాన్ వ‌ర‌ల్డ్ అప్పీల్ తెచ్చినా కానీ త‌న‌కు ఎలాంటి పాత్ర‌ను ఆఫ‌ర్ చేశారు? అన్న‌ది ఆస‌క్తి ని పెంచుతోంది.

ప్ర‌భాస్ కి వ‌ర‌ల్డ్ వైడ్ ఉన్న‌ ఫాలోయింగ్ దృష్ట్యా .. అత‌డు న‌టిస్తున్న 21వ సినిమాపై ప్ర‌ఖ్యాత హాలీవుడ్ మ్యాగ‌జైన్లు దృష్టి సారించాయి. ప్ర‌ముఖ హాలీవుడ్ ఎంటర్ టైన్మెంట్ మ్యాగజైన్ `వెరైటీ` ఈ క్రేజీ ప్రాజెక్టులో దీపిక చేర‌డంపై ఆస‌క్తిక‌ర క‌వ‌ర్ స్టోరీని ప్ర‌చురించింది. దానికి `ప్ర‌భాస్ 21 కాల్డ్` అని టైటిల్ పెట్ట‌డంతో దీపిక తీవ్ర మ‌న‌స్తాపం చెందార‌ట‌. త‌మ‌ చిత్రానికి ప్రభాస్ 21 అని పేరు పెట్టలేదని అది ప్రభాస్ న‌టిస్తున్న‌ 21 వ చిత్రం మాత్రమేన‌ని దీపిక వెంట‌నే `వెరైటీ` ఎడిట‌ర్ కి తెలిపింది. ప్ర‌భాస్ 21 ని ఈ ఏడాది చివ‌రిలో చిత్రీక‌ర‌ణ ప్రారంభించి 2021 ఎండింగ్ లేదా 2022 ఆరంభంలో రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్ అన్న సంగ‌తి తెలిసిందే.