Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: దీపిక నెవ్వ‌ర్ బిఫోర్ బోల్డ్ అవ‌తార్

By:  Tupaki Desk   |   16 March 2021 4:30 PM GMT
ఫోటో స్టోరి: దీపిక నెవ్వ‌ర్ బిఫోర్ బోల్డ్ అవ‌తార్
X
ద‌క్షిణాదిన డెబ్యూ నాయిక‌గా మెరిసిన దీపిక ప‌దుకొనే ఆ త‌ర్వాత ముంబై ప‌రిశ్ర‌మ‌లో అగ్ర క‌థానాయిక‌గా ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తివంత‌మైన‌ది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ద‌శాబ్ధాలుగా స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తున్న దీపిక‌కు ఇప్ప‌టికీ ఎదురే లేదు.

కింగ్ ఖాన్ `చెన్నై ఎక్స్‌ప్రెస్` సినిమాతో ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు పూర్తిగా ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత ఉత్త‌రాది ద‌క్షిణాది అన్న విభేధం లేకుండా అన్నిచోట్లా అభిమానుల్ని సంపాదించుకుంది. ఇక ప‌ద్మావ‌త్ చిత్రంలో దీపిక న‌ట‌న‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు నీరాజ‌నాలు ప‌లికారు. ఈ సినిమాని తెలుగు భాష‌(అనువాదం)లోనే తెలుగు ఆడియెన్ వీక్షించే సౌల‌భ్యం క‌ల‌గ‌డంతో అది దీపిక‌కు అసాధార‌ణ ఫాలోయింగ్ ని తెచ్చింద‌నే చెప్పాలి. ఓం శాంతి ఓం- ప‌ద్మావ‌త్- ల‌వ్ ఆజ్ క‌ల్ ఇవ‌న్నీ త‌న ఇమేజ్ ని పెంచిన‌వే. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలోని సైన్స్ ఫిక్ష‌న్ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఈ సినిమాతో తెలుగు వారికి డార్లింగ్ ఫ్యాన్స్ కి దీపిక మ‌రింత చేరువైపోతోంది.

ఇక సోష‌ల్ మీడియాలో త‌న‌ను అనుస‌రించే అభిమానుల‌కు దీపిక స్పెషాలిటీ గురించి చెప్పాల్సిన‌దేమీ లేదు. ఈ భామ నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి బోలెడంత వినోదం పంచుతోంది. అలాగే తాను న‌టించే త‌న భ‌ర్త ర‌ణ‌వీర్ న‌టించే సినిమాల‌కు సంబంధించిన ప్ర‌తి వివ‌రం ఇన్ స్టా వేదిక‌గా రివీల్ చేస్తోంది.

తాజాగా దీపిక ప‌దుకొనే షేర్ చేసిన ఫోటో హాట్ టాపిక్ గా మారింది. సింపుల్ స్వెట్ ష‌ర్ట్ త‌ర‌హాలో క‌నిపిస్తున్న ఆ డిజైన‌ర్ హాఫ్ షోల్డ‌ర్ ఫ్రాక్ లో దీపిక ఎంతో హాట్ గా క‌నిపిస్తోంది. దీపిక నెవ్వ‌ర్ బిఫోర్ బోల్డ్ లుక్ అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ 83- పఠాన్ చిత్రాల్లో న‌టిస్తోంది. 83 కి నిర్మాత కూడా. శకున్ బాత్రా తెర‌కెక్కిస్తున్న ఓ భారీ చిత్రంలోనూ న‌టిస్తోంది.