Begin typing your search above and press return to search.
అభిమానులకు అలా షాకిచ్చిన స్టార్ హీరోయిన్
By: Tupaki Desk | 20 Jan 2021 5:00 PM ISTఅందాల దీపికా పదుకొనేకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసినదే. పద్మావత్ గా చెరగని ముద్ర వేసిన దీపిక ఫక్తు కమర్షియల్ సినిమాలతోనూ యువతరం ఫేవరెట్ స్టార్ గా నిరూపించుకుంది. రణవీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లాడిన దీపిక పెళ్లి తర్వాతా కెరీర్ పరంగా బిజీబిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాల్లోనూ దీపికకు గొప్ప ఫాలోయింగ్ ఉంది.
ఈ మంగళవారం రాత్రి సోషల్ మీడియాలో ‘నన్ను అడగండి’ సెషన్ ను అభిమానుల కోసం నిర్వహించింది. దీపిక తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని వీడియోలను షేర్ చేసింది. అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అభిమానులలో ఒకరికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఆ విధంగా దీపిక తన అభిమానులను ప్రశ్నలకు అభ్యర్ధనలకు చాలావరకు స్పందించడం ద్వారా వారి పేర్లు ప్రశ్నలను చదివేస్తూ ఆశ్చర్యపరిచింది. ఇది దీపిక నుండి అభిమానులకు పూర్తిగా ఇంటరాక్టివ్ ప్రశ్నోత్తరాల సెషన్ కావడంతో అభిమానులు స్టన్నయిపోయారు.
అభిమానులలో ఒకరు.. మీరు స్వయంగా తయారుచేసే ఇష్టమైన ఆహారం ఏది? అని ప్రశ్నించగా.. దీపిక సమాధానం ఆసక్తికరం.``నేను కాల్చిన ఆహారం ఇష్టంగా తింటాను. కుకీలు ఇష్టం. నాకు వంట కంటే బేకింగ్ అంటే చాలా ఇష్టం. కాబట్టి కుకీలు నా బలం అని చెప్పాలి`` అని తెలిపింది.
మరొక అభిమాని .. మేల్కొన్న తర్వాత మీరు చేసే మొదటి పని ఏది అని అడిగారు. ``నేను మేల్కొన్నప్పుడు చేసే మొదటి పని ఏమిటంటే ... నా అలారంను ఆపేస్తాను`` అని తెలిపింది.
ప్రతిరోజూ ఇష్టంగా చేసేది ఏది? అన్నదానిపైనా ప్రశ్నను సంధించగా... ఫిట్నెస్ ను కాపాడుకోవడం అని .. వ్యాయామంతో డేని ప్రారంభించడం తనకు చాలా ఇష్టమని చెప్పింది. వారమంతా దీన్ని చేయడంలో విఫలమైనప్పటికీ ఒక వారంలో కనీసం మూడు- నాలుగు సార్లు చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపింది.
కెరీర్ సంగతి చూస్తే.. ప్రభాస్ సరసన నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని సైన్స్ ఫిక్షన్ చిత్రానికి దీపిక సంతకం చేసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే సిద్ధంత్ చతుర్వేది - అనన్య పాండేలతో కలిసి శకున్ బాత్రా తదుపరి చిత్రం షూటింగ్ లో దీపిక బిజీగా ఉంది. ఇటీవల హృతిక్ రోషన్ తో కలిసి ఫైటర్ అనే ప్రాజెక్టులోనూ యూనియన్ అయ్యింది.