Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా ఖాతా ఖాళీచేసి.. అడవుల్లోకి వెళ్లిన దీపిక

By:  Tupaki Desk   |   4 Jan 2021 1:40 PM IST
సోషల్ మీడియా ఖాతా ఖాళీచేసి.. అడవుల్లోకి వెళ్లిన దీపిక
X
బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొందుతున్న దీపికా పదుకొనె ఇటీవల అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. న్యూ ఇయర్ రోజున తన సోషల్‌ మీడియా ఖాతాను ఖాళీ చేసింది ఈ బ్యూటీ. తన అకౌంట్లలోని పోస్టులన్నీ డెలిట్ చేయడంతో.. ఏం జరుగుతుందో అర్థంకాక ఫ్యాన్స్ గాబరా పడిపోయారు. కొత్త సంవత్సరం వేళ ఆమెను స్పెషల్‌ గ్రీటింగ్స్‌ వస్తాయని అనుకుంటే.. అసలు అకౌంట్ నే ఖాళీ చేయడంతో ఆందోళనకు గురయ్యారు.

కొంపదీసి దీపిక అకౌంట్‌ హ్యాక్‌ అయిందా? అని చాలా మంది అనుమానపడ్డారు. అయితే.. ఈ సందేహాలకు అదే రోజు సాయంత్రం ఫుల్ స్టాప్ పెట్టింది ఈ బాలీవుడ్ బ్యూటీ. అభిమానులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ ఒక ఆడియో క్లిప్పింగ్‌ను షేర్‌ చేశారు దీపిక.

రాజస్థాన్‌లోని రణతంబోర్‌ పార్క్‌లోలో భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు దీపిక. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు దీపిక. తన కుటుంబంతో క్వాలిటీ సమయం గడుపుతున్నట్లు పేర్కొన్నారు. "నేను కెరీర్‌పరంగా ఎంతో సాధించినప్పటికీ.. వ్యక్తిగతంగా మాత్రం రవ్వంత కూడా మారలేదని నావాళ్లు చెప్తూ ఉంటారు. కానీ నా విజయంలో వాళ్ల పాత్ర ఎంతుందనేది వారికే తెలియదు. వాళ్ల కోసం సమయం కేటాయించడం నాకు అత్యవసరం. దీనివల్ల నేను ఎక్కడి నుంచి ఎక్కడిదాకా చేరుకున్నానో ఓసారి తిరిగి చూసుకోవచ్చు. కాబట్టి దీనికోసం బ్రేక్‌ తీసుకోవాల్సిందే!" అని ఫొటోకు క్యాప్షన్ రాసుకొచ్చారు.

కాగా.. మరోజంట రణ్‌బీర్‌ కపూర్‌-అలియా భట్‌ కూడా రణతంబోర్‌లో హాలీడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేశారు. వారు శనివారమే ముంబైకి తిరిగి వచ్చేశారు.