Begin typing your search above and press return to search.

కడుపూ కాదు.. ఎంగేజ్మెంట్ లేదు..

By:  Tupaki Desk   |   21 July 2016 9:15 AM GMT
కడుపూ కాదు.. ఎంగేజ్మెంట్ లేదు..
X
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హాలీవుడ్ ని కూడా ఏలేందుకు బాగానే ప్రయత్నిస్తోంది. రెండు ఇండస్ట్రీలను సమానంగా బ్యాలెన్స్ టాప్ రేంజ్ లోకి వెళ్లిపోవాలన్నది అమ్మడి ఐడియా. అందుకోసం రెండు ప్రాంతాల మధ్య బాగానే చక్కర్లు కొడుతోంది. అయితే.. ఈమె ప్రెగ్నెంట్ అని.. అందుకే ఎంగేజ్మెంట్ కి రెడీ అవుతోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

రణవీర్ సింగ్ తో దీపికా ప్రేమాయణం సంగతి అందరికీ తెలిసిందే. తన లైఫ్ లో అందరికంటే తనకు ముఖ్యమైన వ్యక్తి.. తనను అర్ధం చేసుకునే వ్యక్తి రణవీర్ కంటే గొప్పవాడు ఎవరూ లేరని అనౌన్స్ చేసిన దీపికాపై.. ఈ మధ్య ప్రెగ్నెన్సీ వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పుడు వీటిపై ట్రిపుల్ ఎక్స్ బ్యూటీ స్పందించింది. 'నేను ప్రెగ్నెంట్ నీ కాదు.. నాకు ఎంగేజ్మెంట్ కూడా కాలేదు.. పెళ్లి చేసుకోవడం లేదు కూడా' అని చెప్పింది దీపిక.

రీసెంట్ గా మనీష్ మల్హోత్రా కలెక్షన్ కి సంబంధించిన ర్యాంప్ వాక్ చేసిన ఈ సుందరాంగిని.. ప్రెగ్నెన్సీపై ప్రశ్నించినపుడు వచ్చిన సమాధానం ఇది. ట్రిపుల్ ఎక్స్ క్సాండర్ కేజ్ షూటింగ్ పూర్తి కాగానే.. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో పద్మావతి మూవీ చేసేందుకు దీపికా పదుకొనే రెడీ అవుతోంది.