Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: పద్మావతీ.. ఏంటీ రచ్చ?

By:  Tupaki Desk   |   19 July 2017 10:40 PM IST
ఫోటో స్టోరి: పద్మావతీ.. ఏంటీ రచ్చ?
X
ఇప్పుడు సెక్సీ లేడి దీపికా పదుకొనె ఉంది చూశారూ.. మరసారి సంజయ్ లీలా భన్సాలి డైరక్షన్లో ఆమె చేస్తున్న ''పద్మావతి'' రిలీజయ్యే వరకు మనకు తెరపై కనిపించదు. అలాగే పెద్దగా ఈవెంట్లలో కూడా అమ్మడు కనిపించట్లేదు. ఎందుకంటే ఆ సినిమా పూర్తయ్యాకనే ముఖం చూపిస్తుందట. కాకపోతే తన ఫ్యాన్స్ హర్టవ్వకుండా ఉండేందుకు అమ్మడు మాత్రం రెగ్యులర్ గా ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది.

మొన్నామధ్యన మ్యాగ్జిమ్ మ్యాగజైన్ ఫోటో షూట్ తో నానా బీభత్సం చేసింది దీపిక. ఆ షూట్లో ఏకంగా ఆమె బికినీ తరహాలో డ్రస్సులో చూపించకూడదు అనుకున్న వాటిని సైతం ఆరబోసింది. ఆ తరువాత యునైటెడ్ కింగ్డమ్ లో ప్రచురితం అయ్యే వానిటి ఫెయిర్ మ్యాగజైన్ కోసం మరో ఘాటైన షూట్ చేసింది. ఇప్పుడు ఫెమినా మ్యాగజైన్ తో ఇండియన్ ఫ్యాన్స్ దగ్గరకు వచ్చేసింది. బ్రా తరహా టాప్ ధరించి ఒకవైపు.. తన కాళ్ళ అందాలను ఆరబోస్తూ మరోవైపు.. అబ్బో రచ్చ చేసిపాడేసింది. ఈసారి కూడా హాట్నెస్ అంటే ఏంటో డిఫైన్ చేసిందీ అమ్మడు.

అయితే పద్మావతి సినిమా రిలీజయ్యేవరకు ఇలా మ్యాగజైన్లలో తన సోకులతో అమ్మడు విరుచుకుపడుతుందేమో. అందుకే ఈ రచ్చంతా. అలా చేయకపోతే ఎంతటి స్టార్ హీరోయిన్ ను అయినా జనాలు మర్చిపోయే ఛాన్సుంది. అది సంగతి.