Begin typing your search above and press return to search.

సైనా నెహ్వాల్ బయోపిక్ లో దీపిక

By:  Tupaki Desk   |   4 Feb 2016 6:09 AM GMT
సైనా నెహ్వాల్ బయోపిక్ లో దీపిక
X
ఇప్పుడు బాలీవుడ్ లో రియల్ స్టోరీలు - బయోపిక్ ల సీజన్ బాగానే నటిస్తోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు రాగా ఇప్పుడు ధోనీ - అజారుద్దీన్ ల సినిమాలు కూడా షూటింగ్ లో ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. అందులో హైద్రాబాదీ టెన్నిస్ సంచలనం సైనా నెహ్వాల్ స్టోరీ కూడా ఉంది. తన స్టోరీని సినిమాగా తీస్తే.. అందులో దీపికా పదుకొనే అయితే మంచి ఛాయిస్ అని గతంలో ఓసారి సైనా అభిప్రాయపడింది. ఇప్పుడా కోరిక తీరబోయే టైం వచ్చేసింది.

దీపికనే హీరోయిన్ గా తీసుకుని సైనా నెహ్వాల్ లైఫ్ స్టోరీని తెరకెక్కించే యత్నం మొదలైంది. అమోల్ గుప్తే ఈ ప్రాజెక్టును హ్యాండిల్ చేయనున్నాడు. ఈ మూవీ చేసేందుకు దీపిక కూడా యాక్సెప్ట్ చేసేసింది. తన ఫ్రెండ్ సైనా పాత్రను చేయడాన్ని ఎంతో ఇష్టపడతానని కూడా దీపిక చెప్పింది. వీళ్లిద్దరూ కలిసి ఈ స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు కూడా. దీపిక తండ్రి ప్రకాష్ పదుకొనే బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. అందుకే ఈ రోల్ చేయడానికి దీపికనే కరెక్ట్ ఛాయిస్ అంటోంది సైనా నెహ్వాల్.

సానియా మీర్జాకు పరిణీతి చోప్రా మాంచి ఫ్రెండ్‌.. అందుకే సానియా పాత్రను చేసేందుకు నేనెప్పుడైనా రెడీ అంటోంది పరిణీతి. ఇలాగే సైనా నెహ్వాల్‌ కు దీపిక మాంచి ఫ్రెండ్‌.. ఈవిడేమో సైనా నెహ్వాల్‌ పేరు చెబుతోంది. ఇలా ఎవరి ఫ్రెండ్స్‌ వారు స్నేహితుల బయోపిక్స్ చేసేసుకుంటామని చెబుతున్నారు. ఈ ఫ్రెండ్షిప్ సినిమాల కాన్సెప్ట్ బాగుంది కదూ.