Begin typing your search above and press return to search.

6PM కాస్కోండి.. టాప్ హీరోయిన్ షాక్ లిస్తుంద‌ట‌!

By:  Tupaki Desk   |   10 Nov 2022 4:31 AM GMT
6PM కాస్కోండి.. టాప్ హీరోయిన్ షాక్ లిస్తుంద‌ట‌!
X
అందానికి అందం.. ఎన‌ర్జీ..బ‌హుముఖ న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో దీపిక ప‌దుకొనే బాలీవుడ్ లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌రుచుకుంది. ఒక‌ ద‌క్షిణాది చిత్రంతో కెరీర్ ని ప్రారంభించినా కానీ ఉత్త‌రాది యువ‌త మ‌న‌సులు దోచి బాలీవుడ్ లో నిల‌దొక్కుకుంది. నిజానికి బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణిగా జాతీయ స్థాయి క్రీడల్లో నిల‌దొక్కుకున్న దీపిక అనూహ్యంగా క‌థానాయిక అయ్యింది. 16 ఏళ్ల వ‌య‌సులోనే తాను న‌టిని కావాల‌నుకున్న‌ట్టు ఒకానొక అవార్డుల వేదిక‌పై దీపిక వెల్ల‌డించింది.

ఇంతింతై వ‌టుడింతై అన్న చందంగా దీపిక కెరీర్ ప్ర‌యాణం గురించి తెలిసిందే. ప‌ద్మావ‌త్ గా దీపిక 600 కోట్ల క్ల‌బ్ నాయిక‌గా సంచ‌ల‌నాలు సృష్టించింది. హిందీ ప‌రిశ్ర‌మ‌లో నాయికా ప్ర‌ధాన చిత్రాల‌తో స‌త్తా చాట‌గ‌లిగే అరుదైన న‌టిగాను రికార్డుల‌కెక్కింది. ఇక ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై మెరిసిన దీపిక పాపుల‌ర్ బ్రాండ్ల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

అగ్ర నాయిక‌గా స్టార్ హీరోల‌తో స‌మానంగా పారితోషికం అందుకుంటున్న ఈ భామ బాలీవుడ్ లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానుల కోసం ఒక స్వీట్ సర్‌ప్రైజ్ ని ప్లాన్ చేసింది. ఈరోజు 6 పీఎం దానికోసం ఎదురు చూడాల్సిందిగా హింట్ ఇచ్చింది.

గ్లోబల్ ఐకాన్ దీపికా పదుకొణె కింగ్ ఖాన్ సరసన ఓం శాంతి ఓం చిత్రంతో బాలీవుడ్ లో నాయిక‌గా అరంగేట్రం చేసింది. నేటితో పరిశ్రమలో తన 15 సంవత్సరాల వార్షికోత్సవాన్ని జ‌రుపుకుంటోంది. ఈరోజు ప్రత్యేక సందర్భంలో తన అభిమానులను కొంచెం ఆశ్చర్యంలో ముంచెత్తాల‌నుకుంటున్న‌ట్టు వెల్ల‌డించింది. 15 సంవత్సరాల ప్ర‌యాణం చాలా పెద్దది! ఈ రోజు DPకి చాలా ముఖ్యమైనది కాబట్టి ఆమె తన అభిమానులకు ఏదైనా కొత్త‌గా చేయాల‌ని ఆలోచించిన‌ట్టు సోర్స్ చెబుతోంది. దీపిక‌ ఈ రోజున ఒక కొత్త ప్రయాణానికి నాంది పలుకుతోంది. కాబట్టి 6 గంటలకు సోషల్ మీడియాలో త‌న‌ను అనుస‌రించాల‌ని హింట్ ఇచ్చింది.

ప‌దిహేను సంవత్సరాల కెరీర్ లో దీపికా పదుకొణె బాక్సాఫీస్ వద్ద తన పట్టును నిరూపించుకోవడమే కాకుండా ఒకదాని తర్వాత ఒకటిగా అద్భుత‌ ప్రదర్శనలతో ఆకట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారతదేశం గర్వపడేలా నిల‌బెడుతూ ప్రపంచవ్యాప్తంగా పదే పదే త‌న‌వైన వేవ్స్ ని క్రియేట్ చేయ‌గ‌లిగింది. ఇటీవల అంతర్జాతీయంగా పాపుల‌రైన అనేక హై-ఎండ్ లగ్జరీ బ్రాండ్ లకు గ్లోబల్ ఫేస్ గా మారిన మొదటి భారతీయ (ఆసియాకు చెందిన) న‌టిగా రికార్డుల‌కెక్కింది. న‌టిగా ప్ర‌చార‌క‌ర్త‌గా దీపిక ఒక ర‌కంగా చరిత్రను తిర‌గ‌రాసింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... దీపిక బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల‌తో బిజీగా ఉంది. జనవరి 23న విడుదలైన 'పఠాన్' టీజర్ లో దీపిక‌ హాట్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇందులో షారుఖ్ ఖాన్ తో కలిసి కనిపించ‌నుంది. త‌న ఫేవ‌రెట్ స్టార్ హృతిక్ తో 'ఫైటర్'లో నిటిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న 'ప్రాజెక్ట్ K'లోను దీపిక న‌టిస్తూ బిజీగా ఉంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తూ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తోను భారీగా ఆర్జిస్తోంది. దీపిక ఒక్కో చిత్రానికి 12 నుంచి 20 కోట్ల మ‌ధ్య పారితోషికం అందుకోవ‌డం బిగ్ స‌ర్ ప్రైజ్.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.