Begin typing your search above and press return to search.

డ్రగ్స్‌ కేసు : దీపికకు నేడు NCB సమన్లు!?

By:  Tupaki Desk   |   22 Sept 2020 8:00 PM IST
డ్రగ్స్‌ కేసు : దీపికకు నేడు NCB సమన్లు!?
X
బాలీవుడ్‌ ను షేక్‌ చేస్తున్న డ్రగ్స్‌ కేసులో ప్రముఖులు ఉన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కేసులో బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపిక పదుకునేకు వారం రోజుల్లో ఎన్‌ సీ బీ సమన్లు జారీ చేయబోతున్నట్లుగా జాతీయ మీడియా సంస్థ టైమ్స్‌ నౌ నిన్నటి నుండి కథనాలు ప్రచారం చేస్తుంది. నిన్న వారంలో సమన్లు ఇవ్వబోతున్నట్లుగా కథనంలో పేర్కొన్న టైమ్స్‌ నౌ ఆ తర్వాత నేడే దీపిక పదుకునేకు సమన్లు ఇవ్వబోతున్నట్లుగా కొత్త కథనంను ప్రసారం చేసింది. టైమ్స్‌ నౌ కథనం చాటింగ్‌ లో 'డీ' అంటే దీపికా అంటూ పేర్కొంది.

డ్రగ్స్‌ కేసులో దీపిక పదుకునే మేనేజర్‌ ఇప్పటికే సమన్లు అందుకుంది. ఎన్‌ సీ బీ వారికి లభించిన ఛాటింగ్‌ ఆధారంగా పలువురికి సమన్లు జారీ చేయబోతున్నట్లుగా టైమ్స్ నౌ తన కథనంలో రాయడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఎంత మంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో కంగనా స్పందిస్తూ డ్రగ్స్‌ రాకెట్‌ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బాలీవుడ్‌ నుండి బహిష్కరించాలంటూ డిమాండ్‌ చేస్తుంది. ముందు ముందు ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో అంటూ యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.