Begin typing your search above and press return to search.
దీపికను చూస్తే ఊపిరి గట్టిగా బిగబట్టాలేమో!
By: Tupaki Desk | 15 April 2021 8:00 AM ISTబాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్స్ జాబితాలో దీపిక పేరు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. స్వతహాగానే దీపిక కథానాయిక కాక ముందు జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. తొలి నాళ్లలోనే ఈ భామ మంచి ప్లేయర్ గా రాణించారు. ఇక కథానాయిక అయ్యాకా ఆ అలవాటును కొనసాగించారు. క్రీడలతో పాటు వ్యాయామం విషయంలో పక్కాగా ఉంటుంది దీపిక. అందుకే తన టోన్డ్ బాడీ మెరుపులు ఇప్పటికీ తగ్గలేదనడంలో అతిశయోక్తి లేదు.
నిరంతరం జిమ్ యోగా సెషన్స్ అంటూ దీపిక షెడ్యూల్స్ గురించి తెలిసిందే. షూటింగ్ బిజీ ఉన్నా ఫిట్నెస్ సెషన్స్ ని అస్సలు విడిచిపెట్టని నటిగా దీపిక పేరు వినిపిస్తుంది. తాజాగా దీపిక వ్యాయామం అనంతర ఫోటోని షేర్ చేసి `బ్రీత్` అన్న ట్యాగ్ ని ఇచ్చారు. తన అభిమానులను ఊపిరి పీల్చుకోవాలని గుర్తుచేస్తున్న ఈ ఫోటో వైరల్ గా మారింది. ఒక అందమైన ఫోటో దానికి తోడు బ్యూటిఫుల్ చిరునవ్వుతో దీపిక కట్టిపడేసిందనే చెప్పాలి.
తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో దీపిక నేలపై కూర్చొని కనిపించింది. వ్యాయామం తర్వాత తనకోసం కొంత విరామం తీసుకుంది. తెల్లని క్రాప్ టాప్ ప్రింటెడ్ ప్యాంటు ధరించి దీపిక పైకి చూసే ముందు వంగి కనిపించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
వీటికి దీపిక భర్త నటుడు రణవీర్ సింగ్ తో పాటు అతియా శెట్టి- మలైకా అరోరా- అనన్య పాండే- ఆయుష్మాన్ ఖుర్రానా- వరుణ్ ధావన్- సోనాక్షి సిన్హా లైక్ లు కొట్టారు. దీపిక ప్రస్తుతం ప్రభాస్ సరసన నాగ్ అశ్విన్ చిత్రంలో నటించనున్నారు. అలాగే 83 రిలీజ్ కి రానుంది. మరోవైపు బాలీవుడ్ లో పలు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ముంబై ఆర్టిస్టుల సంఘానికి తను రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.