Begin typing your search above and press return to search.

తమాషాకి రమ్మంటున్న దీపిక

By:  Tupaki Desk   |   1 Nov 2015 1:00 AM IST
తమాషాకి రమ్మంటున్న దీపిక
X
ఏమైనా దీపికా పదుకొనే స్టైలే వేరు. ఎంతగా పేరు ప్రఖ్యాతులు సాధించినా.. అంత మృదు మధురంగా ప్రవర్తించగలగడం ఆమె గొప్పతనం. మనిషిని చూస్తే బాగా స్పీడ్ అనిపిస్తుంది కానీ.. ఈ అమ్మడి బిహేవియర్ కి ఎవరైనా కరిగిపోవాల్సిందే. లేటెస్ట్ గా ఇలాంటి సంఘటనే మీడియా వాళ్లకు ఎదురైంది. మాజీ లవర్ రణ్ బీర్ కపూర్ తో కలిసి దీపిక రెచ్చిపోయి నటించింది తమాషాలో.

టీజర్ నుంచి ట్రైలర్ వరకూ.. మేకింగ్ నుంచి సాంగ్స్ వరకూ అన్నిటిలోనూ వీరి కెమిస్ట్రీ చూస్తే.. మాజీ లవర్సా ఇప్పుడేమైనా అఫైర్ నడిపిస్తున్నారా అనిపిస్తుంది. ఇప్పుడా తమాషా చిత్రానికి ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు ముంబైలో. ఇందుకోసం మీడియా పర్సన్స్ కి అహ్వానం పంపాలి కదా. ఇన్విటేషన్ అంటే కంప్యూటర్ లో ప్రింట్ చేసి.. పేర్లు మార్చి తలా ఓ కాపీ పంపితే సరిపోతుంది. కానీ దీపిక చాలా విభిన్నం. అందుకే అందరికీ పర్సనల్ ఇన్విటేషన్ లను చేతిరాతతో రాసి పంపింది. అక్టోబర్ 31 , శనివారం రోజున సాయంత్రం ఏడు గంటలకు ఆలివ్, బాంద్రాలో.. తమాషా ఆడియో ఫంక్షన్ కు కలుసుకుందాం రండి.. లవ్ -దీపిక... ఇదీ ఆ లెటర్ సారాంశం.

ఇంత చక్కగా చేతి రాతతో రాసి... అంత పెద్ద హీరోయిన్ అంత ప్రేమగా పిలవడంతో.. ఉబ్బితబ్బిబ్బవుతున్నారు లెటర్ అందుకున్నవాళ్లు. అక్షరాలు, మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలు.. సంగీతంతో చెప్పచ్చు అని ఏఆర్ రెహమాన్ కొటేషన్ ఈ లెటర్ కు అదనపు ఆకర్షణ. తమాషా ఆడియోకి ఇంత సీరియస్ గా పిలవడం చూస్తుంటే.. దీపిక మంచి నైజం అర్ధం అవుతుంది కదూ.