Begin typing your search above and press return to search.

100 కోట్ల సౌత్ సినిమాలో దీపికా పదుకొనె?

By:  Tupaki Desk   |   1 Oct 2016 10:25 AM GMT
100 కోట్ల సౌత్ సినిమాలో దీపికా పదుకొనె?
X
ఇప్పటివరకు బాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యాక మాత్రం అసలు దీపిక పదుకొనె సౌత్ వైపున చూడనేలేదు. ఎంతపెద్ద హీరోల సినిమాలు ఆఫర్ చేయబడినా కూడా అమ్మడు మాత్రం ఒప్పుకోనేలేదు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన కొచ్చాడయాన్ అనే యానిమేటెడ్ కమ్ మోషన్ క్యాప్చర్ సినిమాలో మెరిసింది. ఇప్పుడు ఒక రియలిస్టిక్ బడా బడ్జెట్ ప్రాజెక్టును చేయడానికి ఒప్పుకునేలా ఉందట.

సెక్సిణి దీపిక పదుకొనె రేంజ్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఆమె వరుసపెట్టి పికూ, బాజీరావ్ మస్తానీ వంటి సినిమాలను చేయడం.. ఆ తరువాత హాలీవుడ్లో గగగ సినిమా ఆఫర్ రావడంతో.. అమ్మడు గ్లోబల్ ఐకాన్ అయిపోయినట్లే మరి. కాకపోతే ఇప్పుడు ఖుష్బూ మొగుడు దర్శకుడు సుందర్.సి తీస్తున్న ''సంఘమిత్ర'' సినిమాలో హీరోయిన్ గా చేయమని ఈమెను ఎప్రోచ్ అయ్యారట.

100 కోట్ల బడ్జెట్ తో జయం రవి - ఆర్య హీరోలుగా రూపొందుతున్న ఈ ఫ్యాంటసీ సినిమాలో.. మెయిన్ లీడ్ పాత్రను చేయడానికి దీపిక కూడా ఇంట్రెస్ట్ చూపించినట్లు టాక్. పైగా ఆమెకు ఆఫర్ చేసిన పేమెంట్ కూడా భారీగా ఉండటంతో కాదనలేకపోతోందని తెలుస్తోంది. అయితే దీపిక మేనేజర్ మాత్రం ఇంకా ఈ సినిమా గురించి ఏమీ కన్ఫామ్ కాలేదని చెప్పడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/