Begin typing your search above and press return to search.

సినిమాలు అయ్యాయి, యాపారం మొదలెట్టింది

By:  Tupaki Desk   |   6 Jan 2019 3:42 AM GMT
సినిమాలు అయ్యాయి, యాపారం మొదలెట్టింది
X
ఓ పుష్కరం పాటు బాలీవుడ్‌ ఇండస్ట్రీని ఏలింది దీపిక పదుకోన్‌. సన్నగా రివట్‌ లా ఉండే ఈ బక్క పల్చని బంగారం.. ఈ రేంజ్‌లో బాలీవుడ్‌ ని ఏలుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కింద (సౌత్‌) నుంచి వచ్చింది కదా.. తన తెలివితేటలతో, అందాలతో ఇండస్ట్రీని కుమ్మేసింది. దాదాపు 12 ఏళ్లపాటు ఇండస్ట్రీని ఏలిన దీపిక రన్వీర్‌ సింగ్‌ ని పెళ్లి చేసుకుని సైటిలైపోయింది. పెళ్లైన హీరోయిన్‌ అప్సరసలా ఉన్నా.. అమ్మమ్మలానే చూస్తారు మన ప్రేక్షకులు. దీంతో.. దీపికకు అవకాశాలు బాగా తగ్గాయి. ఫ్యూచర్‌ లో వస్తాయన్న నమ్మకం కూడా లేదు. అందుకే ఇప్పుడు యాపారం మొదలెట్టింది.

దీపిక అదిరిపోయే ఫ్యాషన్‌ ఐకాన్‌. పట్టుచీర, బికినీ.. దేనికైనా సై అనే డేర్‌ బుల్లెట్‌. అలాంటి దీపిక.. ఇప్పుడు తనకున్న ఫ్యాషన్‌ నాలెజ్డ్‌ తో ఒక వెబ్‌ సైట్‌ ను మొదలుపెట్టబోతోంది. ఈ వెబ్‌ సైట్‌ ద్వారా తనకు తెలిసిన టిప్స్‌, లేటెస్ట్‌ ఫ్యాషన్స్‌ అందివ్వబోతోంది. ఇది క్లిక్‌ అయితే.. ఆటోమేటిగ్గా తన పేరుతో ఓ గార్మెంట్‌ మొదలుపెట్టి.. ఆన్‌ లైన్‌ లో అమ్మకాలు కూడా మొదలు పెట్టాలని ప్లాన్‌ చేస్తోంది. సినిమా హీరోలకు, క్రికెటర్లకు ఓన్‌ బ్రాండ్స్‌ ఉన్నాయి. ఇప్పుడు వారిలాగే దీపిక కూడా ఫ్యాషన్ రంగంలో జెండా పాతాలని ప్లాన్‌ చేస్తోంది. సుడిగల సుందరాంగి కదా.. అనుకుంటే అయిపోద్ది... అంతే.