Begin typing your search above and press return to search.

దీపిక హ్యండ్ బ్యాగ్‌ బ‌డ్జెట్ తో ఆల్టో కార్ కొనొచ్చు

By:  Tupaki Desk   |   2 Jan 2021 1:30 PM IST
దీపిక హ్యండ్ బ్యాగ్‌ బ‌డ్జెట్ తో ఆల్టో కార్ కొనొచ్చు
X
స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొనే పారితోషికం చుక్క‌ల్లో ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. హీరోల‌కు ధీటుగా పారితోషికం గుంజేస్తూ నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తుంటుంది. ఇంత‌కుముందు డార్లింగ్ ప్ర‌భాస్ స‌ర‌స‌న నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్ష‌న్ సినిమాలో న‌టించేందుకు 20 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తే 18 కోట్ల‌కు డీల్ కుదిరింద‌న్న ప్ర‌చారం సాగింది. అంతేకాదు మూవీ క్రెడిట్స్ లో దీపిక ప‌దుకొనేకు ప్ర‌త్యేక స్థానం క‌ల్పించేందుకు ప్ర‌భాస్ కి ధీటుగా త‌న స్థానం ప‌దిల‌ప‌ర్చుకునేందుకు తాప‌త్ర‌య ప‌డింద‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

ఈ గుంజుడేమో కానీ.. దీపికా పదుకొనే విలాసాల గురించి తెలిస్తే క‌ళ్లు భైర్లు క‌మ్మ‌కుండా ఉండ‌వు. త‌ను ఉప‌యోగించే కాస్ట్యూమ్స్ ఖ‌రీదు స‌హా మేక‌ప్ కిట్ యాక్సెస‌రీస్ వ‌గైరా వ్య‌వ‌హారాల కోస‌మే ల‌క్ష‌ల్లో త‌గ‌లేస్తోంద‌న్న‌ది ఓ గుస‌గుస‌. తాజాగా నూత‌న సంవ‌త్స‌ర సెల‌బ్రేష‌న్ లో భాగంగా ర‌ణ‌తంబోర్ (రాజ‌స్థాన్) వైల్డ్ లైఫ్ ఫోటోగ్ర‌ఫీ కోసం భ‌ర్త ర‌ణ‌వీర్ తో క‌లిసి షికార్ చేస్తున్న దీపిక చేతిలో ఓ హ్యాండ్ బ్యాగ్ షాక్ కి గురి చేస్తోంది. ఇది ప్ర‌ఖ్యాత `బొట్టెగా వెనెటా బ్యాగ్`.. దీని ధ‌ర ఏకంగా మారుతి ఆల్టో కారు ధరకు స‌మానం అని తెలిసింది.

రణవీర్ సింగ్ ‌తో విహారయాత్రకు బయలుదేరిన దీపికా పదుకొనేవద్ద ఈ ఖరీదైన బొట్టెగా వెనెటా బ్యాగ్ ఉంది. దీని వెళ‌ ఒక సామాన్యుడు ఆల్టో కార్ కొనుక్కుని కుటుంబ స‌మేతంగా షికార్ చేసేంత ఖ‌రీదు అంటే షాక్ తిన‌కుండా ఉండ‌లేం.

బొట్టెగా వెనెటా చైన్ క్యాసెట్ బ్యాగ్ బ్రాండ్ .. అధికారిక వెబ్‌సైట్‌లో $4350 డాల‌ర్లు ఖర్చవుతుంది. అంటే దీని విలువ భార‌తీయ క‌రెన్సీలో రూ 321900 అన్న‌మాట‌. ఇంత పెద్ద మొత్తంతో ఒక సరికొత్త ఆల్టో కారును ఈఎంఐలో కొనుగోలు చేయవచ్చు. అంత చిన్న బ్యాగ్ అంత ఖ‌రీదునా? అంటూ ఫ్యాన్స్ షాక్ కి గుర‌వుతున్నారు.

ఇక ఈ బ్యాగ్ ని క్రాస్ బాడీ స్టైల్లో భుజానికి ధరించవచ్చు. ఇది మాక్సి ఇంట్రెక్సియాటో నాప్పా తోలుతో తయారు చేసిన‌ది. ఈ బ్యాగులు ఎంతో మృధువైన అనుభూతిని క‌ల‌గ‌జేస్తాయి. బ్యాగ్ లోపలి పాకెట్స్ తో మాగ్నెటిక్ లాక్ ఉంటుంది. బొట్టెగా వెనెటా బ్యాగులు ప్రపంచవ్యాప్తంగా స్విష్ సెట్ తో ప్రసిద్ధి చెందాయి. ఇలాంటి వాటిని చాలా మంది బి-టౌన్ స్టార్లు మాత్ర‌మే వినియోగిస్తున్నారు. టాలీవుడ్ లో స‌మంత‌.. ర‌కుల్.. పూజా హెగ్డే ఇలాంటి ఖ‌రీదైన బ్యాగులు కొనేందుకు ఇష్ట‌ప‌డ‌తారు.

ఇక దీపిక లుక్ & ఫ్యాషన్ విషయానికి వస్తే,.. చాలా కొద్దిమంది మాత్రమే దీపికా పదుకొనేతో సరిపోలవచ్చు. ఆమె ప్రయాణించే దుస్తులలో భాగంగా దివా రాక్ బూట్స్ .. డా‌ర్క్ షేడెడ్ కోట్లు.. లెద‌ర్ ప్యాంట్లు.. ధ‌రిస్తుంది. ఇవ‌న్నీ చాలా ఖ‌రీదైన‌వి.