Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: దేవకన్య దిగి వచ్చినట్టుగా
By: Tupaki Desk | 19 Sep 2019 5:16 AM GMTఎనర్జిటిక్ హీరో రణ్ వీర్ సింగ్ ని పెళ్లాడిన తరువాత దీపిక స్పీడ్ పెరిగిందే కానీ ఏమాత్రం తగ్గలేదు. ముంబైలో ఎక్కడ ఏ ఈ వెంట్ జరిగినా అక్కడ తనే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతిసారీ పోటీపడుతూ ఇంకా ఇంకా అందంగా ముస్తాబవుతూ చూపరుల్ని తనవైపే తిప్పేసుకుంటోంది. తాజాగా ఐఫా గ్రీన్ కార్పేట్ పై దీపికా పదుకునే హోయలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆమె అందానికి ప్రముఖ డిజైనర్ల తో పాటు నెటిజనులు ఫిదా అయిపోయారు. గ్రీన్ కార్పెట్ పై క్యాట్ వాక్ చేసిన దీప్ అందాలని చూడాల్సిందే అంటూ ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీపిక నెవ్వర్ బిఫోర్ ఫ్యాషన్ ఇది. దేవకన్య దిగి వచ్చినట్టుగా ఉంది.. ఫెదర్ క్వీన్ అదిరిపోయింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా కౌచర్ డిజైన్ చేసిన వయోలెట్ కలర్ ఔట్ ఫిట్ లో దీపిక గ్రీన్ కార్పెట్ పై మెరిసిపోయింది. దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవ కన్యలా డిప్స్ మెరిసిపోవడం చూపరులని ఆకట్టుకుంది. ఎలక్ట్రిక్ వయొలెట్ కలర్ గౌన్ లో తల పై భాగం నుంచి కార్పెట్ పై వరకూ పరిచిన ఆలంకరణ అబ్బురపరిచింది. నెమలి పురి విప్పి ఆడిందా? అన్నంతగా తళుకుబెళుకులు ప్రదర్శించింది. పింక్ షేడ్ లో వయోలెట్ కలర్ తో మల్టిపుల్ డిజైనర్ డ్రెస్ దీపిక అందాల్ని మరింతగా మెరిసేలా చేసింది. మల్టీ షేడ్ ఎంబ్రాయిడరీ వర్క్ డ్రెస్ వల్ల దీపూ మరింత కాతులీనింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రణవీర్ సరసన `83` చిత్రంలో రియల్ లైఫ్ పాత్రలో నటిస్తున్న దీపిక.. మేఘనా గుల్జార్ రూపొందిస్తున్న `చపాక్` చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్నాయి. 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో రూపొందుతున్న 83 చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ- ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.