Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : ముంబైకి ప్యారిస్ త‌లొంచ‌దా?!

By:  Tupaki Desk   |   7 Oct 2018 6:19 PM IST
ఫోటో స్టోరీ : ముంబైకి ప్యారిస్ త‌లొంచ‌దా?!
X
ఆర‌డుగుల బుల్లెట్టు! అని పాట రాశాడు కృష్ణ చైత‌న్య‌. ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ ని త‌ల‌చుకుని రాశాడు. కానీ ఇక్క‌డ ఆర‌డుగుల పైగానే ఉందీ భామ‌. అందుకే పొడుగు కాళ్ల సుంద‌రి అని అభిమానులు ముద్దుగా పిలుచుకున్నారు. ద‌శాబ్ధ కాలంగా బాలీవుడ్‌ ని ఏల్తున్న దీపిక అంద‌చందాలు - హొయ‌లు ఆల్వేస్ యూత్‌ లో హాట్ టాపిక్‌. అందులోంచి మ‌రో మ‌చ్చు తునక ఈ ఫోటో.

ప‌ద్మావ‌త్ చిత్రంతో 600కోట్ల క్ల‌బ్ నాయిక‌గా ఓ వెలుగు వెలిగిన అందాల‌ దీపిక నాయికా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించి బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు తేగ‌లిగే స‌త్తా ఉన్న మేటి న‌వ‌త‌రం నాయిక‌గా ప్ర‌పంచం గుర్తించింది. ఈ అంద‌గ‌త్తె తొంద‌ర్లోనే త‌న ప్రియుడు ర‌ణ‌వీర్ సింగ్ ని పెళ్లాడేందుకు రెడీ అవుతోంది. న‌వంబ‌ర్‌ లో ఈ జంట వివాహం ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ పెళ్లి వేడుక కార‌ణంగానే దీపిక ఇటీవ‌లి కాలంలో అస‌లు ఏ సినిమాకి అంగీక‌రించ‌డం లేద‌న్న ప్ర‌చారం ఉంది. ఓవైపు పెళ్లి ప‌నులు సాగుతున్నా ఎందుక‌నో ఇంకా అధికారికంగా దానికి సంబంధించిన ఏ స‌మాచారాన్ని లీక్ చేయ‌డం లేదు. దీపిక‌ - ర‌ణ‌వీర్ ఇద్ద‌రూ ఈ న‌వంబ‌ర్‌ లో ర‌క‌ర‌కాల ఈవెంట్ల‌తో బిజీ అయిపోతున్న కార‌ణంగా పెళ్లి ఉంటుందా.. లేదా అన్న సందిగ్ధ‌త నెల‌కొంద‌ని ఇటీవ‌ల వార్త‌లొచ్చాయి.

తాజాగా ముంబైలో జ‌రుగుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క ఎల్లే బ్యూటీ అవార్డ్స్ 2018 కార్యక్ర‌మంలో దీపిక‌ పాల్గొంది. ముంబైకి ఫ్యాష‌న్ వ‌ర‌ల్డ్ ప్యారిస్ త‌లొంచాల్సిందే అన్న తీరుగా దీపిక ర్యాంప్ వాక్‌ ల‌తో చెల‌రేగిపోయింది. మిరుమిట్లు గొలిపే అద్భుత‌మైన డిజైన‌ర్ వేర్‌ లో హంస‌లా త‌ళుక్కుమంది.