Begin typing your search above and press return to search.

పక్షుల ప్రేమ చెప్పక్కర్లేదు.. చూస్తే చాలు

By:  Tupaki Desk   |   10 Dec 2015 7:00 PM IST
పక్షుల ప్రేమ చెప్పక్కర్లేదు.. చూస్తే చాలు
X
ఓ జంట లవ్ లో ఉన్నారో లేదో చెప్పడం అంత కష్టమైన విషయమేం కాదు కానీ.. యాక్టర్ల దగ్గరే అసలు తంటా వస్తూ ఉంటుంది. అంతలోనే తన ప్రేమికులను మార్చేసేయడమే అసలు సమస్య. మరోవైపు అప్పటికే యాక్టింగ్ లో ఇరగదీసేసే నటులు.. ఇలాంటి విషయాల్లో అయితే జీవించేస్తూ ఉంటారు.

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే - యంగ్ స్టార్ రణ్ వీర్ సింగ్ లు ప్రేమ పక్షులు అని బాలీవుడ్ తో పాటు చాలా మీడియాలు చెబ్తూ ఉంటాయి. అయితే వీళ్లు మాత్రం ఎప్పుడూ అవునని అనరు. అలాగని కాదని కూడా చెప్పరు. కాకపోతే.. వీళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం, దగ్గరితనం చూసి మిగతా వాళ్లు అలా అనుకోవాలంతే. వీళ్లిద్దరూ కలిసి నటించిన బాజీరావ్ మస్తాన్ చిత్రం.. ఈ నెల 18న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దీపిక - రణ్ వీర్ లు కలిసి ప్రమోషన్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు.

మరాటా పేష్వా బాజీరావ్ కోసం మార్చిన లుక్ కి - ట్రెండీ గార్మెంట్స్ ధరించి రణ్ వీర్ సందడి చేస్తుండగా.. దీపికా మాత్రం రకరకాల డ్రస్సులతో కనిపిస్తోంది. అయితే.. ఎక్కడికెళ్లినా వీళ్లిద్దరి రిలేషన్ - అఫెక్షన్ బాగా హాట్ టాపిక్ అవుతోంది. మరి ఇద్దరూ అమర ప్రేమికులుగా నటించిన సినిమా రిలీజ్ అయ్యాక అయినా.. అసలు ప్రేమ కథ సంగతి చెప్పే అవకాశాలున్నాయా అన్నదే అసలు ప్రశ్న.