Begin typing your search above and press return to search.
రాముడిగా అగ్రహీరో.. సీతగా ఆర్ ఆర్ ఆర్ బ్యూటీ బెటరంట!
By: Tupaki Desk | 8 May 2020 5:00 PM ISTరామాయణ్.. 1987లో దూరదర్శన్ లో వచ్చిన ఈ భారీ సీరియల్ లో సీతగా నటించి విశేష అభిమానులను సంపాదించారు దీపికా చిఖలియా. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు.
తాజాగా దీపికా ఒక గొప్ప సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధురాలు, సరోజిని నాయుడు బయోపిక్ ‘సరోజిని’ అనే సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రస్తుత లాక్ డౌన్ లో ఇమె నటించిన ‘రామాయణ్’ మరోసారి ప్రేక్షకుల కోరిక మేరకు దూరదర్శన్ లో ప్రసారమవుతోంది.
ఈ సందర్భంగా అప్పటి రామాయణాన్ని మళ్లీ తీస్తే ఎవరు నటించాలో కూడా దీపిక తెలిపింది. అదిప్పుడు వైరల్ గా మారింది. ఒక వేళ రామయాణాన్ని సినిమాగా తెరకెక్కిస్తే సీతారాముల పాత్రలకు హృతిక్ రోషన్, ఆలియా భట్ లు పర్ ఫెక్ట్ గా సెట్ అవుతారని దీపికా తెలిపారు. ఇక అజయ్ దేవగణ్ రావణుడిగా.. వరుణ్ ధావణ్ లక్ష్మణుడి పాత్రలు చేస్తే బాగుంటుందని దీపికి తెలిపింది.
ఇక బీజేపీలో 1991లో చేరిన దీపిక నాడు వాజ్ పేయి స్ఫూర్తితో రాజకీయాల్లోకి రాణించారు. బరోడా నుంచి ఎంపీగా దీపిక గెలిచారు. దీపిక తెలుగులో యమపాశం అనే సినిమాలో నటించారు.