Begin typing your search above and press return to search.

హాలీవుడ్‌ ను అంత తేలికగా తీసేసిందేంటి..!

By:  Tupaki Desk   |   30 May 2022 5:30 PM GMT
హాలీవుడ్‌ ను అంత తేలికగా తీసేసిందేంటి..!
X
బాలీవుడ్‌ స్టార్స్ కు ఈమద్య హాలీవుడ్ నుండి పిలుపు వస్తోంది. చాలా మంది బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ హాలీవుడ్‌ లో చిన్నా చితకా సినిమాల్లో నటించడం మనం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా పలు హాలీవుడ్ సినిమాల్లో మరియు వెబ్‌ సిరీస్‌ ల్లో నటించడం ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకుని గ్లోబర్ స్టార్‌ అనే పేరును కూడా దక్కించుకుంది.

ఇప్పుడు దీపిక పదుకునే కూడా హాలీవుడ్‌ నుండి ఆఫర్లను అందుకుంటుందట. కాని ఆమెకు హాలీవుడ్‌ వెళ్లే ఆలోచన లేదని తెలుస్తోంది. ఇటీవల కాన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్ లో జ్యూరీ మెంబర్ గా వ్యవహరించి అందరి దృష్టిని ఆకర్షించింది.

ముఖ్యంగా దీపిక పట్ల హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ ఆకర్షితం అయ్యారట. ఆ సమయంలోనే దీపిక పదుకునే కు సినిమా ఆఫర్‌ చేశారట. కాని దీపిక మాత్రం సున్నితంగా తిరష్కరించిందట.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక పదుకునే మాట్లాడుతూ.. హాలీవుడ్‌ నుండి ఆఫర్లు వస్తున్న మాట నిజమే. కాని నేను ఎప్పుడు కూడా ఇంగ్లీష్ సినిమాల్లో నటించాలని నేను అనుకోలేదు. చిన్న సినిమాల్లో చిన్నా చితకా ఆఫర్ల కోసం.. సెకండ్‌ హీరోయిన్ పాత్రల కోసం హాలీవుడ్‌ కు వెళ్లాలని తాను భావించడం లేదని కూడా దీపికా పదుకొనే చెప్పుకొచ్చింది.

హాలీవుడ్‌ లో చిన్న ఆఫర్‌ అయినా కూడా ప్రపంచం మొత్తం చూసే సినిమా అవ్వడం వల్ల ఖచ్చితంగా అది పెద్ద ఆఫరే అనేది కొందరి అభిప్రాయం. కాని ఆమె మాత్రం అక్కడ చిన్న వేషాల కోసం ఇక్కడ మంచి సినిమాలను.. మంచి ఆఫర్లను వదులుకోను అంటూ తేల్చి చెప్పింది. హాలీవుడ్‌ సినిమా ఆఫర్లను చాలా సింపుల్‌ గా తీసేసింది.

ప్రియాంక చోప్రా చిన్న పాత్రలు చేసుకుంటూనే ఇప్పుడు పెద్ద స్థాయికి ఎదిగింది. అందుకే దీపిక కూడా ఇంగ్లీష్‌ సినిమాల్లో వచ్చిన ఆఫర్లను తిరష్కరించకుండా చేస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్‌ ఆఫర్ల ను అంత తేలికగా తీసివేయవద్దు అనేది ఆమె అభిమానుల మరియు ఇండస్ట్రీ వర్గాల టాక్‌.