Begin typing your search above and press return to search.

ఈ హాట్ ఏషాలే కరువయ్యాయ్

By:  Tupaki Desk   |   1 Aug 2017 11:34 AM GMT
ఈ హాట్ ఏషాలే కరువయ్యాయ్
X
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఇప్పుడు అందం కూడా తోడైంది. ఈ షో టెలికాస్ట్ కావడం ప్రారంభించి రెండు వారాలు పూర్తి కాగా.. ఇప్పటివరకూ నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా వినిపించాయి. మొదటివారం మేకప్ లెస్ సెలబ్స్ చూసి జనాలు మొహం తిప్పుకోవడంతో.. రెండోవారంలో కొంతమేర ట్రెండ్ మార్చారు.

అలాగే రీసెంట్ గా మధుప్రియకు ఉద్వాసన పలికేసిన బిగ్ బాస్.. ఈ షోలోకి తొలి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశించింది దీక్షా పంత్. ఇలా షోలోకి రావడం రావడంతోనే స్విమ్మింగ్ పూల్ లో దూకేసి.. తన కవ్వింపులతో అందరినీ మెస్మరైజ్ చేసి పారేసింది. పూల్ లో అమ్మడి చిందులకు ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయిపోయారు. ఆ వెంటనే పార్టిసిపెంట్స్ అందరికీ ఆడ మగా తేడా లేకుండా.. వేడి వేడి హగ్గులు ఇచ్చేసి వారిని కూడా బాగానే కనెక్ట్ చేసేసుకుంది దీక్ష. నిజానికి ఈ కార్యక్రమంలో ఇప్పటివరకూ మిస్ అయిన ఎలిమెంట్ ఇదే. ఇటువంటి హాట్ ఏషాలే కరువయ్యాయ్. అందుకే ప్లాన్డ్ గా వ్యవహరించిన బిగ్ బాస్ నిర్వాహకులు.. దీక్షా పంత్ గ్లామర్ ను బాగానే ఉపయోగించుకుంటున్నారు.

మరోవైపు ఇప్పటివరకూ చిన్నా చితకా సినిమాలు మాత్రమే చేసిన ఈ భామ.. ఇప్పుడు సడెన్ గా బిగ్ బాస్ వస్తున్న క్రేజ్ ను బాగానే ఉపయోగించుకునేందుకు ఫిక్స్ అయిపోయింది. మొత్తానికి బిగ్ బాస్ కార్యక్రమంతో కూడా సెన్సేషనల్ అయిపోవచ్చని బాలీవుడ్ లో చాలామంది భామలు ప్రూవ్ చేసుకున్నట్లు ఇప్పుడు దీక్ష కూడా మరోసారి ప్రూవ్ చేస్తోందనమాట.